Dasara Movie: వాలెంటైన్స్ డే రోజున ‘ఓరి వారి’ అంటూ బ్రేకప్ సాంగ్ పట్టుకొస్తున్నా నాని!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Movie: వాలెంటైన్స్ డే రోజున ‘ఓరి వారి’ అంటూ బ్రేకప్ సాంగ్ పట్టుకొస్తున్నా నాని!

Dasara Movie Second Single To Be Out On February 13

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Teaser: దసరా టీజర్‌లో ఇది గమనించారా.. ఎందుకంటారు..?

ఇక ఈ సినిమా నుండి మరో అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమా నుండి రెండో సింగిల్ సాంగ్‌ను వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న రిలీజ్ చేస్తున్నట్లు దసరా టీమ్ ప్రకటించింది. ‘ఓరి వారి’ అంటూ సాగే ఈ హార్ట్ బ్రేకింగ్ ఆంథెమ్ సాంగ్‌ను ప్రేమికుల రోజు కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ధూంధాం దోస్తాన్ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.

Dasara Teaser: దసరా టీజర్.. రస్టిక్ కాదు.. అంతకు మించిపోయిన నాని!

నాని ఊరమాస్ అవతారంలో నటిస్తున్న ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి అత్యద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఈ చిత్ర టీజర్‌ను ఇటీవల రిలీజ్ చేయగా, దానికి స్టన్నింగ్ రెస్పాన్స్ దక్కింది. మరి వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ కాబోతున్న సెకండ్ సింగిల్ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.