Dasara Movie: దసరా నుండి ఓఎస్‌టీ రిలీజ్.. పండగ చేసుకోమంటున్న చిత్ర యూనిట్..!

నాచురల్ స్టార్ నాని నటించిన ‘దసరా’ మూవీ నుండి ఓఎస్‌టీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Dasara Movie: దసరా నుండి ఓఎస్‌టీ రిలీజ్.. పండగ చేసుకోమంటున్న చిత్ర యూనిట్..!

Dasara Movie To Release OST Soon

Dasara Movie: నాచురల్ స్టార్ నాని, అందాల భామ కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం ‘దసరా’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేయగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా చిత్ర యూనిట్ తెరకెక్కించగా, నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు మేజర్ అసెట్‌గా నిలిచింది ఈ చిత్ర మ్యూజిక్.

Dasara Movie: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న సిల్క్ బార్.. మాస్ కా బాప్ అంటోన్న ఫ్యాన్స్!

చమ్కీలా అంగిలేసి పాట మొదలుకొని, చిత్రంలోని బీజీఎం వరకు సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాకు ఆయన సంగీతం ఊరమాస్‌గా ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించడంతో నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా ఈ సినిమా నిలిచింది. అయితే, ఇప్పుడు ఈ సినిమా నుండి ఓఎస్‌టీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

Dasara Movie: నైజాంలో కొనసాగుతున్న ‘దసరా’ స్ట్రాంగ్ రన్..!

ఈ సినిమాలోని ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను రిలీజ్ చేస్తే, అది ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. దీంతో ఈ సినిమా ప్రేక్షకుల్లోకి మరింతగా వెళ్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తుండటం విశేషం.