Dasara Movie: ‘దసరా’ సినిమా ఈ మూడింటి చుట్టే తిరుగుతుందట!

టాలీవుడ్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ఊరమాస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను బాగా పెంచేశాయి. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఇదివరకు చూడని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తోంది.

Dasara Movie: ‘దసరా’ సినిమా ఈ మూడింటి చుట్టే తిరుగుతుందట!

Dasara Movie To Revolve Around This Three Aspects

Dasara Movie: టాలీవుడ్ నుండి వస్తున్న మరో పాన్ ఇండియా మూవీ ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో ఊరమాస్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను బాగా పెంచేశాయి. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ ప్రేక్షకులు ఇదివరకు చూడని విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తోంది.

Dasara Movie: దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్!

ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను లాంచ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ కాగా, ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట భారీ ప్రమోషన్స్ చేపట్టింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. కాగా, తాజాగా దసరా చిత్రానికి సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా కథ మూడు అంశాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో అతిముఖ్యమైనవి కూడా ఈ మూడు అంశాలేనట. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రాసుకున్న ఈ చిత్ర కథలో స్నేహం, ప్రేమ, ఎమోషన్‌కు పెద్దపీట వేశాడట.

Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!

ఈ మూడింటి చుట్టూ తిరిగే కథను సింగరేణి నేపథ్యంలో మనకు అద్భుతంగా చూపెట్టనుందట దసరా యూనిట్. ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె కూడా డీగ్లామర్ పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ అందిస్తున్న సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. మార్చి 30న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాలోని మూడు కీలక అంశాలను చిత్ర దర్శకుడు ఏ విధంగా హ్యాండిల్ చేశాడనే విషయం తెలియాలంటే, దసరా చిత్రాన్ని థియేటర్లలో చూసే వరకు వెయిట్ చేయాల్సిందే.