Dasara Movie: దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాతో నాని కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Movie: దసరా ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన నాని అండ్ టీమ్!

nani dasara trailer

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ మూవీగా ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాతో నాని కూడా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!

కాగా, ఈ సినిమాను మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమా ట్రైలర్‌ను లక్నో పట్టణంలో మార్చి 14న మధ్యాహ్నం 3.33 గంటలకు స్థానిక ప్రతిభ థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ ట్రైలర్ లాంచ్‌కు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నట్లు చిత్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Dasara Movie: బుల్లితెరపై సుమతో కలిసి నాని ‘దసరా’ ధూం ధాం

పూర్తిగా తెలంగాణ యాసతో తెరకెక్కిన ఈ సినిమాలో నాని రస్టిక్ లుక్ ఈ సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లనుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది. ఈ సినిమాను శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. నాని కెరీర్‌లో తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. మరి రేపు రిలీజ్ కానున్న ఈ చిత్ర ట్రైలర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.