Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అటు ఈ సినిమాలోని పాటలు, టీజర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేశాయి.

Dasara Movie: దసరా ట్రైలర్ అప్డేట్ వచ్చేసింది.. అంచనాలు పెంచేసిన కొత్త పోస్టర్!

Dasara Movie Trailer Update Creates More Hype

Dasara Movie: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం ‘దసరా’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తుండగా, పూర్తి రా అండ్ రస్టిక్ కథతో ఈ సినిమాను చిత్ర యూనిట్ రూపొందించింది. ఇక ఈ సినిమాలో నాని ఊరమాస్ లుక్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అటు ఈ సినిమాలోని పాటలు, టీజర్ ఈ సినిమాపై నెలకొన్న అంచనాలను మరింతగా పెంచేశాయి.

Dasara Movie: బుల్లితెరపై సుమతో కలిసి నాని ‘దసరా’ ధూం ధాం

ఈ సినిమాను మార్చి 30న రిలీజ్ చేస్తుండటంతో, చిత్ర ప్రమోషన్స్‌ను ప్రారంభించింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. దసరా సినిమాపై నెలకొన్న భారీ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, తాజాగా ఈ ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేసింది చిత్ర యూనిట్. రావణ దహనం చేస్తూ హీరో నాని చేతిలో గొడ్డలి పట్టుకున్న పోస్టర్‌తో దసరా చిత్ర ట్రైలర్ అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Dasara Movie: చమ్కీల అంగిలేసి మూడో పాటను పట్టుకొస్తున్న నాని

దీంతో, ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర యూనిట్ రూపొందించగా, ఈ సినిమాతో నాని బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ విజయాన్ని అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోండగా, సంతోష్ నారాయణన్ ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. మరి ఈ సినిమా నుండి రాబోయే మాసివ్ ట్రైలర్‌కు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే మార్చి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.