డేవిడ్ వార్నర్ ‘ఆచార్య’

డేవిడ్ వార్నర్ ‘ఆచార్య’

David Warner Aacharya : డేవిడ్ వార్నర్..ఆస్ట్రేలియన్ క్రికేటర్. క్రికెట్ తో తన ఆటను చూపించిన ఈ క్రీడాకారుడు..తనలో మరో కోణం ఉందని చూపిస్తున్నాడు. టిక్ టాక్ వీడియోలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రధానంగా దక్షిణాది సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగ్స్ తో వీడియోలను సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ..అభిమానులను అలరిస్తున్నాడు ఇతను. లాక్ డౌన్ సమయంలో..బాహుబలి డైలాగ్ తో పాటు..భార్యతో కలిసి బుట్టబొమ్మ..అంటూ..స్టెప్పులు వేసి అదరగొట్టాడు.

ఇప్పుడు మరో వీడియోతో ముందుకొచ్చాడు. మెగాస్టార్ చిరంజీవి న్యూ ఫిల్మ్…‘ఆచార్య’ సినిమాలో డైలాగ్ తో వీడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. రీఫేస్ యాప్ తో ఛేంజ్ చేసి..ఆ వీడియో ఇన్ స్ట్రాగ్రామ్ లో పోస్టు చేశాడు. కమింగ్ సూన్ అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఫేస్ యాప్ వచ్చిన తర్వాత..బాహుబలిలో ప్రభాస్, మహర్షిలో మహేష్ బాబు, దర్బార్ లో రజనీకాంత్, సల్మాన్ ఖాన్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను అనుకరిస్తూ..చేసిన వీడియోలు పోస్టు చేసి ప్రేక్షకులను అలరించాడు.

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’. మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో.. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌‌మెంట్, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ ‘ఆచార్య’. దీనికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయి..రికార్డులు సృష్టిస్తోంది.

‘‘ఇతరుల కోసం జీవించేవారు దైవంతో సమానం.. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు’’.. అంటూ చరణ్ వాయిస్ చెప్పాడు.. టీజర్ చివర్లో చిరు చెప్పిన ‘‘పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా.. అందరూ ఎందుకో ‘ఆచార్య’ అంటుంటారు.. బహుశా.. గుణపాఠాలు చెప్తాననేమో..’’ అంటూ చిరు చెప్పిన డైలాగ్ కు అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోయారు.

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)