RRR Poster : వార్నర్ క్రియేటివిటీ.. ఎన్టీఆర్‌గా కేన్ విలియమ్సన్.. చరణ్‌గా వార్నర్..!

ట్రెండ్‌కు తగినట్టుగా ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవలే రిలీజ్ అయిన తెలుగు మూవీ RRR పోస్టర్ కంటపడగానే వార్నర్ వెంటనే తన క్రియేటివిటీకి మళ్లీ పదును పెట్టాడు.

RRR Poster : వార్నర్ క్రియేటివిటీ.. ఎన్టీఆర్‌గా కేన్ విలియమ్సన్.. చరణ్‌గా వార్నర్..!

David Warner Shares Morphed Rrr Poster (1)

David Warner morphed RRR poster : క్రికెట్ మైదానంలోనే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్ గా ఉంటాడు డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడిగా అందరికి సుపరిచితుడు.. తన తెలుగు అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తుంటాడు ఈ ఆస్ట్రేలియన్ ఓపెనర్.. ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తూ అలరిస్తున్నాడు. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్‌లు వేస్తాడు.. డైలాగులు చెబుతాడు.

వార్నర్ ఎప్పటికప్పుడూ ఎంగేజ్ అవుతూ తన ఫాలోవర్లను అలరిస్తుంటాడు. ప్రత్యేకించి తెలుగు చిత్ర పరిశ్రమ అంటే వార్నర్ కు ఎంతో ఇష్టం కూడా. అందుకే తెలుగు ఫ్యాన్స్ ను ఫిదా చేసేందుకు కొత్తగా ట్రై చేస్తుంటాడు. ట్రెండ్ కు తగినట్టుగా వార్నర్ పోస్టు చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటీవలే తెలుగు అప్ కమింగ్ మూవీ RRR పోస్టర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ RRR పోస్టర్ కంటపడగానే వెంటనే వార్నర్ తన క్రియేటివిటీకి మళ్లీ పదును పెట్టాడు.

Rrr

RRR పోస్టర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ బైక్ పై వెళ్తున్న ఫొటోను మార్ఫింగ్ చేసేశాడు వార్నర్.. బైక్ నడిపే ఎన్టీఆర్ తలకు తన తోటి క్రికెటర్, హైదరాబాద్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ తలను తగిలించాడు. బైక్ వెనుక కూర్చొన్న రాంచరణ్ తలకు తన తగిలించాడు 34ఏళ్ల వార్నర్.. ఈ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో వార్నర్ పోస్టు చేశాడు. అంతే.. క్షణాల్లోనే వైరల్ అయింది. వార్నర్ పోస్టు చేసిన ఫొటోను చూసిన అభిమానులు ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. వార్నర్ పోస్టుపై సన్ రైజర్స్ టీమ్ మేట్ రషీద్ ఖాన్ స్పందించాడు.. అరే భాయ్.. ‘Helmet guys’ హెల్మెట్ ఎక్కడ అంటూ కామెంట్ చేశాడు. దానిపై వార్నర్ స్పందిస్తూ.. నువ్వు కూడా రషీద్ భాయ్ అంటూ కామెంట్ చేశాడు.

Rashid Khan

ఇప్పటికే RRR ఫొటోకు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకోవాలంటూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఫొటోలకు హెల్మెట్లు పెట్టి.. సంపూర్ణంగా ఉందని ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్‌గా ఆర్ఆర్ఆర్ బృందం కూడా ట్వీట్ చేసింది.. ఇంకా పోస్టర్ సంపూర్ణంగా లేదని నంబరు ప్లేట్ మిస్సయింది అంటూ ట్వీట్ చేసింది. ఫ్యాన్స్ కూడా బైక్ కు హెడ్ లైట్ కూడా లేదని ఫన్నీ ట్వీట్లతో కల్పించుకున్న అభిమానులు ఆ బైక్‌కు హెడ్‌లైట్ కూడా లేదని సరదా కామెంట్లతో హోరెత్తించారు.