డియర్ కామ్రేడ్ : ‘కడలల్లె వేచే’ లిరికల్ సాంగ్

డియర్ కామ్రేడ్ నుండి 'కడలల్లె వేచె కనులే, కదిలేను నదిలా కలలే.. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 15, 2019 / 06:55 AM IST
డియర్ కామ్రేడ్ : ‘కడలల్లె వేచే’ లిరికల్ సాంగ్

డియర్ కామ్రేడ్ నుండి ‘కడలల్లె వేచె కనులే, కదిలేను నదిలా కలలే.. లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్..

సెన్షేషనల్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, భరత్ కమ్మా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్‌పై.. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, వై.రవిశంకర్, యష్ రంగినేని నిర్మిస్తున్న సినిమా.. డియర్ కామ్రేడ్. గీతగోవిందం తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన డియర్ కామ్రేడ్ టీజర్, ‘నీ నీలి కళ్ళల్లోని ఆకాశమే’ సాంగ్‌కి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు డియర్ కామ్రేడ్ నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసారు.

‘కడలల్లె వేచే కనులే, కదిలేను నదిలా కలలే.. ఒడిచేరి ఒకటై పోయే, తీరం కోరే ప్రాయం’.. అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ బాగుంది. జస్టిన్ ప్రభాకరన్ ట్యూన్, రెహ్మాన్ లిరిక్స్, సిడ్ శ్రీరామ్, ఐశ్వర్య రవిచంద్రన్‌ల వాయిస్  ఈ పాటను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్ళాయి. యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న డియర్ కామ్రేడ్ జూలై 26న రిలీజ్ కానుంది.
ఈ సినిమాకి కెమెరా : సుజిత్ సారంగ్, ఎడిటింగ్ : శ్రీజిత్ సారంగ్, డైలాగ్స్ : జయకృష్ణ, లిరిక్స్ : రెహ్మాన్, ఆర్ట్ : రామాంజనేయులు, స్టంట్స్ : G (మురళి)

వాచ్ లిరికల్ వీడియో..