కడసారి చూపు కోసం : నివాసానికి గొల్లపూడి భౌతికకాయం

  • Published By: madhu ,Published On : December 14, 2019 / 11:04 AM IST
కడసారి చూపు కోసం : నివాసానికి గొల్లపూడి భౌతికకాయం

ప్రముఖ రచయిత, సీనియర్ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి గొల్లపూడి మారుతీ రావు భౌతికకాయాన్ని నివాసానికి తరలించారు. చెన్నైలోని ఓ ఆస్పత్రి నుంచి 2019, డిసెంబర్ 14వ తేదీ శనివారం మధ్యాహ్నం శారదాంబల్ వీధిలో గల నివాసంలో గొల్లపూడి మారుతీరావు పార్థివదేహాన్ని ఉంచారు. సాయంత్రం నుంచి భౌతికకాయాన్ని అభిమానులు సందర్శించేందుకు అనుమతినివ్వనున్నారు. డిసెంబర్ 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు జరుగనున్నాయి. మనువడు, మనవరాళ్లు విదేశాల్లో ఉండడంతో అంత్యక్రియలు ఆలస్యమయ్యాయని కుటుంబసభ్యులు వెల్లడించారు. 

* 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం ఉదయం 11గంటలకు చికిత్స పొందుతూ గొల్లపూడి తుదిశ్వాస విడిచారు. 
* రచయితగా, నటుడుగా, సంపాదుకుడిగా, వ్యాఖ్యతగా, విలేకరిగా..తెలుగు సాహిత్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 
* సినిమా రంగంలోనూ..నాటకాలు, కథలు, నవలలు రాశారు. 
* ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో గొల్లపూడి చిత్ర రంగ ప్రవేశం చేశారు. 
 

* గొల్లపూడికి ముగ్గురు కుమారులు. మూడో కుమారుడు శ్రీనివాస్ 1992, ఆగస్టు 12న చనిపోయారు. 
* కుమారిని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పారు. 
* చెన్నైలో నివాసం ఉంటున్న రెండో కుమారుడు రామకృష్ణ వద్ద గొల్లపూడి ఉంటున్నారు. 
* బంధువులు అందరూ వచ్చిన తర్వాత ఆదివారం అంత్యక్రియలు నిర్వహిస్తామని రామకృష్ణ వెల్లడించారు. 
Read More : ఏపీకి వేల కోట్ల రూపాయలు తెస్తా : వర్మ సినిమా ఫ్లాప్..పిచ్చి సినిమా – పాల్