Deepika – Ranveer : లావిష్ బంగ్లా అంత పెట్టి కొన్నారా..!

బాలీవుడ్ యంగ్ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌‌ కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి బీచ్‌కి దగ్గర్లో అదిరిపోయే బంగ్లా కొన్నారు..

Deepika – Ranveer : లావిష్ బంగ్లా అంత పెట్టి  కొన్నారా..!

Deepika Ranveer

Deepika – Ranveer: సెలబ్రిటీలు ఏం చేసినా సెన్సేషనే మరి. బయట కనిపిస్తే వారు వేసుకునే డ్రెస్ దగ్గరినుంచి పెట్టుకునే వాచెస్ అండ్ గాగుల్స్ వంటి వాటి గురించిన వివరాలు, నడిపే కార్లు, నివాసముండే ఇళ్లు గురించి వార్తలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి.

Anchor Sreemukhi : శ్రీముఖి ఇంట విషాదం..

బాలీవుడ్ యంగ్ కపుల్ దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్‌‌ల కొత్త ఇంటి గురించిన న్యూస్ ఒకటి మీడియా అండ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కెరీర్ మాంచి ఫామ్‌లో ఉండగానే ఓ ఇంటివారైన ఈ జంట ప్రస్తుతం ముంబై ప్రభాదేవి ప్రాంతంలోని ఓ లగ్జీరియస్ అపార్ట్‌మెంట్‌లో 26వ ఫ్లోర్‌లో నివాసముంటున్నారు.

Kajal Aggarwal : కాజల్ ప్రెగ్నెంటా..?

రీసెంట్‌గా మహారాష్ట్రలోని అలీబాగ్‌లో 22 కోట్లతో ఓ లావిష్ బంగ్లా కొన్నారట. 18 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు బెడ్‌రూమ్స్ గల ఈ ఇళ్లు కిహిమ్ బీచ్‌కి కేవలం పది నిమిషాల దూరంలో ఉంది. ఈ ఇంటి రిజిస్ట్రేషన్ కోసమే స్టాంప్ డ్యూటీగా 1.32 కోట్లు చెల్లించారని తెలుస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ఏరియాలో ఇల్లు కొన్నారు.

GARUD : బాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ మూవీ.. దేని గురించో తెలుసా..

సినిమాల విషయానికొస్తే.. భార్యభర్తలిద్దరు కలిసి ‘83’ మూవీ చేస్తున్నారు. రణ్‌వీర్ ‘జయేష్ భాయ్ జోర్దార్’, ‘రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని’ నటిస్తున్నాడు. దీపిక.. అమితాబ్ బచ్చన్‌తో ‘ది ఇంటర్న్’, హృతిక్ రోషన్‌కి జంటగా ‘ఫైటర్’ తో పాటు ఓ హాలీవుడ్ సినిమా కూడా చేస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్ – నాగ్ అశ్విన్ కలయికలో రానున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ – K’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Deepika Padukone : హాలీవుడ్‌లో బిజీ అవుతున్న బాలీవుడ్ భామ..