రాజమండ్రిలో దీపిక ఓటుకు.. కాజల్ ఫొటో

10TV Telugu News

ఏపీలో ఓటర్ లిస్ట్‌ పై ఇప్పటికే ఎన్నో అనుమానాలు. లిస్ట్‌లో కొత్త పేర్లు చేర్చ‌.. లేేని వారి పేర్లు తీసేయ‌డం కామ‌న్‌. అసలు ఎవరి ఓటు ఉందో..ఎవరి ఓటు ఊడిపోయిందో..? అనే టెన్షన్ కూడా ఉంది. ఈ క్రమంలోనే ఓట్లు చెక్ చేసుకుంటున్నారు. అందరికీ కళ్లు బైర్లు చిత్రావిచిత్రాలు.. బయటపడుతున్నాయి.  మా ఓట్లు గల్లంతయ్యాయని ఓవైపు ప్రజలు గగ్గోలు పెడుతుంటే.. మరో వైపు మన రాష్ట్రానికి సంబంధంలేని సెలబ్రిటీలు ఓటర్ లిస్ట్‌లో దర్శనమిస్తున్నారు.  
Read Also : తమిళ్ అర్జున్ రెడ్డిలో.. ధృవ్‌కి తండ్రిగా స్టార్ డైరెక్టర్!

ఎన్నికల అధికారులు బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పదుకునేకు ఓటు ఇచ్చారు. ఓటు సరే.. ఫొటో కూడా మార్చేశారు. దీపక ఓటుకి కాజల్ ఫొటో పెట్టారు. ఇంటి నెంబర్ తో సహా చక్కగా డీటెయిల్స్ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ఓటర్ల లిస్ట్ లో ఈ చిత్రం కనిపించింది. మరీ ఇంత గుడ్డిగా ఓటు హక్కు ఎలా ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ త‌ప్పు చూసుకుని స‌రిదిద్దే ప‌నిలో ప‌డ్డారు అధికారులు.

ఇలా ఓటర్ల జాబితాలో సినీ తారల పేర్లు కనిపించడం కొత్తేమీ కాదు. గతంలో ఇలాంటివి చాలానే జరిగాయి. కాకపోతే ఈసారి రాజమండ్రిలో. గతంలో జరిగిన ఘటనలకు ఇది కొంచెం భిన్నం.. ఎందుకంటే.. పేరు దీపక.. ఫొటో కాజల్ కావటం కొంచెం వైవిధ్యం.

Deepika Padukone Name And Kajal Agarwal Photo In Rajahmundry Voters List

Read Also : మీకు మీరే సాటి : పాల్ చేష్ట‌లు – వ‌ర్మ సెటైర్లు