డార్లింగ్‌తో దీపిక..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమాలో దీపికా పదుకొనే నటింనుందని బాలీవుడ్ సమాచారం..

  • Published By: sekhar ,Published On : March 1, 2020 / 12:58 PM IST
డార్లింగ్‌తో దీపిక..

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమాలో దీపికా పదుకొనే నటింనుందని బాలీవుడ్ సమాచారం..

‘బాహుబలి’ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు ప్రభాస్. ‘సాహో’ తర్వాత ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు డార్లింగ్. సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రభాస్, ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కలయికలో ఓ సినిమా నిర్మించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రభాస్ హీరోగా నటిస్తున్న 21వ సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటింనుందని బాలీవుడ్ సమాచారం. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్, దీపికను కలిసి కథ చెప్పగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

త్వరలో అధికారిక ప్రకటన రానుంది. తండ్రి అశ్వనీదత్‌తో కలిసి  స్వప్నా దత్, ప్రియాంక దత్ నిర్మించనున్నారు. ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. 2021 చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.