దీపికా పదుకొణే ప్రోగ్రెస్ కార్డు‌ చూశారా

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 06:15 AM IST
దీపికా పదుకొణే ప్రోగ్రెస్ కార్డు‌ చూశారా

దీపికా ప‌దుకొణే  సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు నెటిజన్స్ తో షేర్ చేసుకుంటది. అయితే ఇప్పుడు ఆమె చిన్ననాటి విషయాలను గుర్తుచేసుకుంటు.. సోష‌ల్ మీడియా ద్వారా తన స్కూల్ డేస్‌ కు సంబంధించిన కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

వివరాలు.. దీపికా తను చదువుకున్నప్పటి పోగ్రెస్ కార్డును షేర్ చేయ‌గా.. బాలీవుడ్ స్టార్స్‌తో పాటు భ‌ర్త ర‌ణ్‌వీర్ సింగ్ కూడా స్పందించాడు. అయితే ఓ రిపోర్ట్‌లో దీపికా చెప్పిన మాట స‌రిగా విన‌దు అని ఉంది. దీనిపై ర‌ణ్‌వీర్ స్పందిస్తూ.. అవును టీచ‌ర్‌, మీరు స‌రిగ్గా చెప్పారు అని కామెంట్ పెట్టాడు. వెంటనే దీపికా కూడా ఈ రోజు రాత్రి నీకు డిన్న‌ర్ క‌ట్ అని పోస్ట్ పెట్టింది. 

ఇలా వీరిద్ద‌రి మ‌ధ్య స‌ర‌దాగా సాగిన చాట్ నెటిజ‌న్స్‌ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం దీపికా పదుకొణే ‘చపాక్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. మరోవైపు తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి క‌పిల్ దేవ్ బ‌యోపిక్‌లో క‌లిసి న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది ఈ సినిమా విడుద‌ల కానుంది.