Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పదుకొణె..

దీపికా ఈ ప్రశ్నకి సమాధానమిస్తూ.. ''ప్రేక్షకుల్లో రెండు రకాలు ఉంటారు. కొంతమంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడితే, మరికొంతమంది ఇంట్లో కూర్చుని చూసేందుకు...................

Deepika Padukone : ఓటీటీలతో సినీ పరిశ్రమకు నష్టం లేదు.. కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో దీపికా పదుకొణె..

Deepika

Deepika Padukone :   ప్రస్తుతం ఫ్రాన్స్ లో ప్రతిష్టాత్మక కాన్స్ ఫిల్మ్‌ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ చిత్రోత్సవంలో పలువురు భారతీయ నటీనటులు కూడా పాల్గొంటున్నారు. ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ సభ్యుల్లో దీపికా పదుకొణె కూడా ఒకరిగా ఎంపికైంది. తాజాగా జరుగుతున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో దీపికా పదుకొణె తన డిఫరెంట్ డ్రెస్సులతో మెరిపిస్తుంది. కాన్స్ స్టేజిపై దీపికా ధగధగ మెరిసిపోతుంది. బుధవారం సాయంత్రం జరిగిన కాన్స్ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో దీపికా కూడా పాల్గొనగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది.

Thaman : నా భార్యతో కలిసి స్టేజి షోలు చేయాలి.. చిరకాల కోరికని బయటపెట్టిన తమన్..

ఓ రిపోర్టర్ కరోనా వల్ల ఓటీటీలు బాగా పెరిగాయి. చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. దీని వల్ల సినీ ఇండస్ట్రీకి ఏమైనా నష్టం చేకూరుతుందా? అని అడగగా దీపికా ఈ ప్రశ్నకి సమాధానమిస్తూ.. ”ప్రేక్షకుల్లో రెండు రకాలు ఉంటారు. కొంతమంది థియేటర్లలో చూసేందుకు ఇష్టపడితే, మరికొంతమంది ఇంట్లో కూర్చుని చూసేందుకు ఇష్టపడతారు. ఓటీటీల్లో చూసేవారు కూడా థియేటర్లకు వెళతారు. థియేటర్స్ కి ప్రేక్షకులు వస్తూనే ఉంటారు, వారి వల్లే థియేటర్స్ బతుకుతాయి. అలాగే కొన్ని కథలను ఓటీటీలోనే చెప్పడం కుదురుతుంది. కొన్ని కథలని కొత్త ఫార్మేట్ లో చెప్పాలి అనుకుంటే ఓటీటీ సరైన వేదిక. ఈ విధంగా కథలను చెప్పడం మంచి విషయమే. వాటి వల్ల సినీ ఇండస్ట్రీకి నష్టం ఉండదు. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌ను అవకాశంగా మాత్రమే చూస్తాను. ఓటీటీల వల్ల దర్శకులు, నిర్మాతలు, రచయితలు, నటులకు అవకాశాలు పెరుగుతాయే తప్ప సినీ ఇండస్ట్రీకి ఎలాంటి ముప్పు ఉండదు” అని తెలిపింది.