బాలీవుడ్ టు టాలీవుడ్ : ప్రభాస్ సరసన దీపికా పడుకోన్!

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 08:06 AM IST
బాలీవుడ్ టు టాలీవుడ్ : ప్రభాస్ సరసన దీపికా పడుకోన్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోన్.. టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్యాన్ ఇండియా సినిమా రేంజ్ దాటి ప్యాన్ వరల్డ్ లెవల్ కి వెళుతున్న సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరమీద మెరవబోతోంది. బేసిక్ గా సౌత్ హీరోయిన్ అయినా కూడా తెలుగులో ఎప్పటినుంచో సినిమా గురించి అనుకుంటున్నా కూడా..ఆఖరికి ఆ ప్యాన్ ఇండియా స్టార్ తో సినిమాకి ఓకే చెప్పింది ఈ ముద్దుగుమ్మ.

బాహుబలి, సాహోతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ను ప్యాన్ వరల్డ్ సినిమాతో యూనివర్సల్ స్టార్ గా మార్చబోతున్నాడు నాగాశ్వీన్. ఈ భారీ ప్యాన్ వరల్డ్ మూవీకి తగినట్టు .. హీరోయిన్ కూడా అదే రేంజ్ లో ఉండాలనుకున్నారు టీమ్, అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పడుకోన్ ని సెలక్ట్ చేసుకున్నారు. 

దీపికా పడుకోన్ అంతకుముందే టాలీవుడ్ లో సినిమా చేస్తోందని టాక్ వనిపించింది. RRRలో దీపికా పడుకోన్ చేస్తోందన్న టాక్ బాగా నడిచింది. అంతేకాదు ..జాన్ సినిమాలో కూడా ప్రభాస్ తో దీపికా చేస్తోందని న్యూస్ చక్కర్లు కొట్టింది. దీపికా కూడా సౌత్ లో స్పెషల్లీ తెలుగులో సినిమా చెయ్యాలని ఉందని, అయితే టైమ్ సెట్ అవ్వక చెయ్యలేకపోతున్నానని చెప్పింది. 

ఇన్నేళ్లకు దీపికా తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం అవుతోంది. దీపికా ఫేవరెట్ హీరో మహేష్ బాబు అయినా .. ప్రభాస్ తో సినిమా చెయ్యాలనుకుంటోందని పబ్లిక్ గానే ఎక్స్ ప్రెస్ చేసింది దీపికా. ప్రభాస్ ఇమేజ్ కి, సినిమా స్పాన్ కి తగినట్టు నాగాశ్విన్ సినిమాలో  దీపికాను ఆల్ మోస్ట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్  ప్రొడక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్  వర్క్ ఫాస్ట్ గా జరుగుతోంది. 

Read: బాలయ్య – బోయపాటి న్యూ ఫిల్మ్ టైటిల్ ‘మోనార్క్’ ?