Deepika Ranveer: సోషల్ మీడియా సాక్షిగా రణ్వీర్‌ను తెగపొగిడేసిన దీపికా!

బాలీవుడ్ మోస్ట్ హ్యాపియెస్ట్, క్యూటెస్ట్, హాటెస్ట్ కపుల్ రణవీర్, దీపికా. ఈ ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లు పెళ్లి చేసుకుని రెండేళ్లు దాటినా.. నిన్నో, మొన్నో డేటింగ్ స్టార్ట్..

10TV Telugu News

Deepika Ranveer: బాలీవుడ్ మోస్ట్ హ్యాపియెస్ట్, క్యూటెస్ట్, హాటెస్ట్ కపుల్ రణవీర్, దీపికా. ఈ ఇద్దరు బాలీవుడ్ టాప్ స్టార్లు పెళ్లి చేసుకుని రెండేళ్లు దాటినా.. నిన్నో, మొన్నో డేటింగ్ స్టార్ట్ చేశారేమో అన్నట్టు కనిపిస్తారు. మా ఆవిడ దేవత అని రణవీర్ మెచ్చుకుంటుంటే.. మా ఆయన ప్రపంచంలోనే బెస్ట్ హజ్బెండ్ అంట తెగ పొగిడేస్తోంది దీపికా. మరి ఈ పొగడ్తలన్నీ ఎక్కడో ఎందుకో చూద్దాం.

NTR: ప్రాణాపాయం నుండి కోలుకున్న తారక్ అభిమాని.. వీడియో కాల్ వైరల్!

బాలీవుడ్ లో ద మోస్ట్ లవబుల్ అండ్ హాట్ కపుల్ గా కనిపించే రణవీర్, దీపికా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎప్పుడూ సరదాగా ఉండే ఈ బ్యూటిఫుల్ కపుల్ లేటెస్ట్ గా పోస్ట్ చేసిన వీడియోతో తెగ సందడి చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒకర్నొకరు తెగ పొగిడేసుకుంటున్నారు.

Romantic: మోహానికి, ప్రేమకు మధ్య జరిగే కథకు ఎమోషన్ తోడైతే రొమాంటిక్!

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే దీపికా పడుకోన్.. లేటెస్ట్ గా జరిగిన తన ఫోటో షూట్ నిపోస్ట్ చేసి.. బేసిక్ గా నేను యాక్టర్ అయినా.. అథ్లెట్ గా ఎప్పుడూ ఫిట్ గా ఉండడానికే ట్రై చేస్తాను అంటూ క్యాప్షన్ పెట్టింది. రణవీర్ దీపికా పోస్ట్ కి.. నేను బేసిక్ గా హాట్ గా ఉంటాను కానీ నా లైఫ్ లో క్యూట్ గా కూడా ఉండడానికే ట్రై చేస్తాను అంటూ కామెంట్ పెట్టారు. దీనికి దీపికా.. ఒప్పుకుంటున్నాను. వరల్డ్స్ బెస్ట్ హజ్బెండ్ నువ్వే అంటూ స్వీట్ రిప్లై ఇచ్చింది.

UnStoppable NBK: షోలో సందడి చేయాలా..! దెబ్బకు థింకింగ్ మారిపోవాలా..!

6 ఏళ్లు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లి చేసుకుని సూపర్ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. అటు రీల్ లైఫ్ లో రియల్ లైఫ్ లో సూపర్ హిట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న దీపికా, రణవీర్ తమమద్య ఉన్న స్వీట్ రిలేషన్ ని పబ్లిక్ గా ఎక్స్ ప్రెస్ చెయ్యడానికి ఎప్పుడూ హెజిటేట్ చెయ్యరు. ఈ ముచ్చటైన జంటను చూసి తెగ మురిసిపోతుంటారు ప్యాన్స్.