Deepthi Sunaina: షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత లైవ్‌లో దీప్తీ కన్నీళ్లు

బిగ్‌బాస్ షో నుంచి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత దీప్తీ సునైనా చేసిన పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

Deepthi Sunaina: షణ్ముఖ్‌తో బ్రేకప్‌ తర్వాత లైవ్‌లో దీప్తీ కన్నీళ్లు

Deepthi

Deepthi Sunaina: షణ్ముఖ్, దీప్తి సునైనా నెట్టింట హల్‌చల్ చేసిన ఫేమస్ కపుల్.. ఈ జంట గత ఐదేళ్లుగా రిలేషన్‌లో ఉండగా.. సోషల్ మీడియాలో, టీవీ షోల్లో చాలా సార్లు చాలా క్లోజ్‌గా కనిపిస్తూ హల్‌చల్ చేశారు. అంతేకాదు.. వీరి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నారు.

లేటెస్ట్‌గా బిగ్‌బాస్ షో నుంచి షణ్ముక్ బయటకు వచ్చిన తర్వాత దీప్తీ సునైనా చేసిన పోస్ట్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. మా ఐదేళ్ల ప్రేమ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సునైనా ప్రకటించించింది. ఇకపై ఎవరి దారులు వారివి అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టేసింది.

ఆ ప్రకటన తర్వాత లేటెస్ట్‌గా సోషల్ మీడియాలోకి వచ్చిన దీప్తి సునైనా.. ‘‘బ్రేకప్‌ పోస్ట్‌ పెట్టడానికి కారణం ఏంటీ’’ అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. ‘‘జీవితంలో ఎప్పటికీ ఒకేలా ఉండాలని లేదు కదా?. కెరీర్‌పరంగా ఏదైనా సాధించాలని అనుకుంటున్నా.. ఇప్పటివరకూ నా గురించి నేను ఆలోచించుకోలేదు. నా కెరీర్‌ని పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకోవాలని అనుకుంటున్నా” అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు దీప్తి సునైనా.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, కొంతమంది నెటిజన్లు మాత్రం ‘‘ధైర్యంగా ఉండు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు షణ్ముఖ్‌ సైతం ఇన్‌స్టాలో ‘‘హృదయం ముక్కలైన’’ ఎమోజీలతో ఓ పోస్ట్ షేర్ చేశారు. దీంతో వీరిద్దరూ విడిపోయినట్లే అని అందరూ భావిస్తున్నారు.