Deepthi Sunaina : నేను ఒంటరి కాదు.. తండ్రితో ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన దీప్తి సునైనా

ఇటీవల షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత దీప్తి సునైనా, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పి విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులు దీప్తి, షణ్ముఖ్ వార్తల్లో........

Deepthi Sunaina : నేను ఒంటరి కాదు.. తండ్రితో ఎమోషనల్ వీడియోని షేర్ చేసిన దీప్తి సునైనా

Deepthi

Deepthi Sunaina :  సోషల్ మీడియా స్టార్ దీప్తి సునైనా సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోస్ తో, గతంలో బిగ్ బాస్ కి వెళ్లి ఫేమ్ తెచ్చుకుంది. ఇక దీప్తి తన ప్రియుడు షణ్ముఖ్ గురించి చాలా సార్లు అనేక స్టేజిల మీద చెప్పింది. కానీ ఇటీవల షణ్ముఖ్ బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత దీప్తి సునైనా, షణ్ముఖ్ కి బ్రేకప్ చెప్పి విడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని రోజులు దీప్తి, షణ్ముఖ్ వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత దీప్తి లైవ్ లోకి వచ్చి ఈ విషయంపై మాట్లాడుతూ ఏడ్చేసింది కూడా. ఇక ఈ బ్రేకప్ తర్వాత నుంచి దీప్తి సన్నిహితుల వద్ద కూడా సైలెంట్ అయిపోయిందని సమాచారం. తాను ఒంటరిగా ఫీల్ అవుతున్నట్టు సన్నిహితులు పేర్కొన్నారు.

Indraani : ఇండియన్ ఫస్ట్ సూపర్ ఉమెన్ ‘ఇంద్రాణి’

ఇక బ్రేకప్ తర్వాత సోషల్ మీడియాలో లైఫ్ కి సంబంధించి మోటివేషన్ కోట్స్ పెడుతుంది. తాజాగా తన తండ్రితో కలిసి ఉన్న ఓ వీడియోను షేర్‌ చేసింది. ఇందులో ‘డాడీ’ సినిమాలోని తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న సాంగ్ పెట్టి వాళ్ళ నాన్నతో తనకు ఉన్న అనుబంధాన్ని షేర్ చేసింది. ఈ వీడియో షేర్ చేస్తూ… ”ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అదే తండ్రి ప్రేమ” అంటూ పోస్ట్ చేసింది.