Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ ప్రేమ బంధం తెంచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసుకున్న ఈ జంటలో దీప్తి సునయన ఎమోషనల్ గా చాలా బాధలో ఉంది.

Siri-Shanmukh: బాధలో దీప్తి.. జెస్సీ, సిరితో షన్ను ఎంజాయ్‌మెంట్!

Siri Shanmukh

Siri-Shanmukh: యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్ జస్వంత్ ప్రేమ బంధం తెంచేసుకున్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా బ్రేకప్ చెప్పేసుకున్న ఈ జంటలో దీప్తి సునయన ఎమోషనల్ గా చాలా బాధలో ఉంది. తన ప్రాణం అనుకున్న బంధం తెగిపోయిందని లైవ్ లోనే ఏడ్చేసిన దీప్తి తాను ఎంతగా ప్రేమించిందో చెప్పుకొచ్చింది. దానికి షణ్ముఖ్ కూడా బాధపడుతూ హార్ట్ బ్రేక్ ఎమోజీలను పోస్ట్ చేశాడు.

Radhe Shyam: కరోనాతో జాగ్రత్త.. రాధేశ్యామ్ దర్శకుడి ట్వీట్ దుమారం!

కానీ.. ఇప్పుడు అదే సోషల్ మీడియాలో షణ్ముఖ్ బిగ్ బాస్ షోలో తన కో కంటెస్టెంట్లయినా జెస్సీ, సిరిలతో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సిరితో షణ్ముఖ్ ఇలా పార్టీలు, షికార్లు చేస్తూ తిరగడంపై అభిమానులు మండిపడుతున్నారు. బిగ్ బాస్ షోలో సిరితో రాసుకుపూసుకు తిరగడం వలనే సిరితో ప్రేమ తెగదెంపులు అయిందన్న ప్రచారం జరుగుతుండగానే షణ్ముఖ్ ఇలా మళ్ళీ సిరితోనే ఎంజాయ్ చేస్తుండడంపై మండిపడుతున్నారు.

Dhruv-Banita : ప్రేమలో మునిగితేలుతున్న ‘అర్జున్‌రెడ్డి’ హీరో హీరోయిన్??

ఒకపక్క దీప్తి ఇలా విచారంలో ఉండగానే షణ్ముఖ్ ఇలా పార్టీలు చేసుకోవడంపై నెటిజన్స్ భయంకరంగా ట్రోల్స్ చేస్తున్నారు. అయితే.. ఈ ఫోటోలు బిగ్ బాస్ షోను బయటకి వచ్చాక జరిగినవే కాగా ఇప్పటి ఫోటోలు కాదని తెలుస్తుంది. బిగ్ బాస్ షోను బయటకి వచ్చాక కూడా షణ్ముఖ్ దీప్తికి దూరంగా ఉండడం వలనే దీప్తి బ్రేకప్ చెప్పిందనే ప్రచారం కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా దీప్తి-షణ్ముఖ్-సిరి వ్యవహారం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది.