Bigg Boss 5: షన్నుకి హింట్ ఇచ్చిన దీప్తి.. బాబోయ్ ఇంత ఇంటెలిజెంటా?

యధావిధిగా ప్రతి సీజన్ మాదిరే వారాల తరబడి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో కాస్త జోష్ నింపి కొద్దిగా దాన్ని కూడా క్యాష్ చేసుకొనే బిగ్ బాస్ ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల..

Bigg Boss 5: షన్నుకి హింట్ ఇచ్చిన దీప్తి.. బాబోయ్ ఇంత ఇంటెలిజెంటా?

Bigg Boss 5 (2)

Bigg Boss 5: యధావిధిగా ప్రతి సీజన్ మాదిరే వారాల తరబడి బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో కాస్త జోష్ నింపి కొద్దిగా దాన్ని కూడా క్యాష్ చేసుకొనే బిగ్ బాస్ ఈ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను హౌస్ లోకి తీసుకొచ్చాడు. ముందు రెండు రోజులు ఇంట్లోకి కొందరిని పంపిన బిగ్ బాస్ ఆ తర్వాత మరికొందరు బిగ్ బాస్ స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. గతంలో ఇదే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఇంట్లో మెలిగిన దీప్తి సునయన ఈ వారం షన్ను ప్రేయసిగా బిగ్ బాస్ స్టేజ్ మీద సందడి చేసింది.

Bigg Boss 5 Elimination: రవి ఔట్.. అదే నిజమైతే విమర్శలు తప్పదా?

ప్రేమికుడు షన్నుతో మనసు విప్పి మాట్లాడిన దీప్తి.. ఎమోషన్స్‌ను స్ట్రెంత్‌గా మార్చుకో కానీ వీక్‌ అయిపోవద్దని ఎమోషనల్ లెక్చర్ ఇచ్చింది. అయితే, ఇంట్లోకి రాగానే దీప్తి తెలివిగా షన్నుకి ఓ హింట్‌ ఇచ్చిందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆమె రెండు వేళ్లతో మైక్‌ పెట్టుకోడం మరో చేత్తో దాన్ని షన్నుకి అర్ధమయ్యేలా టచ్ చేయడం తను రెండో స్థానంలో ఉన్నాడని పరోక్షంగా చెప్పిందని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అలాగే ‘సచ్చినోడా’ అంటూ ప్రేమగా అంటూనే వేళ్లతో సైగలు చేయడం కూడా హాట్ టాపిక్ అవుతుంది.

OTT Release Clash: నువ్వా.. నేనా.. ఓటీటీల్లోనూ రిలీజ్ వార్

దీప్తి చేసిన సైగలు సోషల్ మీడియాలో వీడియోల రూపంలో హల్చల్ చేస్తుండడంతో దీప్తి సునైనా కూడా దీనిపై స్పందించింది. అయితే.. నా జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయనంటూ తన ఇన్‌స్టా స్టోరీతో ఓ పోస్ట్‌ని పెట్టింది. ‘మీ బొందరా మీ బొంద.. నా జీవితంలో ఇలాంటి చీప్‌ ట్రిక్స్‌ని ప్రయోగించను. షణ్ముఖ్‌ విషయంలోనే కాదు.. నా లైఫ్‌లో దేనికోసం అలాంటి పనులు చేయను. నా దృష్టిలో షణ్ముఖే బిగ్‌బాస్‌ విన్నర్‌’ అని చెప్పుకొచ్చింది.