Celebrities Ads : యాడ్స్ విషయంలో సెలబ్రిటీలకు షాక్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్..

మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజాగా సెలబ్రిటీల ప్రమోషన్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు......................

Celebrities Ads : యాడ్స్ విషయంలో సెలబ్రిటీలకు షాక్ ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్..

Department of Consumer Affairs released new guidelines for celebrities in promoting ads and promotions

Celebrities Ads :  చాలా మంది సినిమా, సీరియల్, స్పోర్ట్స్ సెలబ్రిటీలు కచ్చితంగా యాడ్స్ చేస్తారు. యాడ్స్ తో ఎక్కువ డబ్బులు వస్తుండటంతో చాలామంది సెలబ్రిటీలు యాడ్స్ చేస్తారు. కొంతమంది సెలబ్రిటీలు కంటెంట్, ప్రోడక్ట్ చూసుకొని జాగ్రత్తగా అరుదుగా యాడ్స్ చేస్తారు. కొంతమంది సెలబ్రిటీలు అసలు ఎంత డబ్బు ఇస్తామన్నా యాడ్స్ మాత్రం చేయరు. ఇక కొంతమంది సెలబ్రిటీలు మాత్రం రెగ్యులర్ గా ఏ యాడ్ వచ్చినా చేస్తారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత కేవలం స్టార్ సెలబ్రిటీలు కాక సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్లు, ఇన్‌ఫ్లూయన్సర్స్ అని పిలిపించుకునే వాళ్ళు కూడా డబ్బుల కోసం పలు ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేస్తున్నారు.

దీనివల్ల సెలబ్రిటీలకు మేలు కలిగినా కొన్ని సార్లు వినియోగదారులకు నష్టం చేకూరుతుంది. వారు ప్రమోట్ చేసిన ప్రోడక్ట్ బాగోకపోతే నష్టపోయేది వినియోగదారుడే. ఈ విషయంలో సెలబ్రిటీల మీద పలు కేసులు కూడా ఫైల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి ప్రమోషన్స్, యాడ్స్ ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను తెచ్చింది.

Upasana : ఈ ఏడాది మా ఆయనదే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా చరణ్‌కి సపోర్ట్‌గా ఉంటాను.. ఉపాసన వ్యాఖ్యలు..

మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ శాఖ తాజాగా సెలబ్రిటీల ప్రమోషన్స్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇకపై సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయర్స్.. ఎవరైనా సరే ఒక ప్రొడక్ట్ ని ప్రమోట్ చేసేటప్పుడు కచ్చితంగా ఆ ప్రొడక్ట్ ని వాడి చూడాలి. ఆ ప్రొడక్ట్ వాడకుండా అసత్యపు ప్రచురణలు చేయకూడదు. అలాగే ఎలాంటి ప్రొడక్ట్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినా కచ్చితంగా అది ప్రమోషన్, యాడ్, డబ్బులు తీసుకొని చేస్తున్నట్టు తెలియచేయాలి.

పోస్టర్స్, వీడియోల రూపంలోని యాడ్స్ పై వాటి గురించి ఉన్న అన్ని డీటెయిల్స్ ని సరిగ్గా చెప్పాలి అంటూ నోటీసు జారీ చేసింది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. సెలబ్రిటీలు చేసే యాడ్స్, ప్రమోషన్స్ పై ఒక కన్ను వేసి ఉంచుతామని, ఎవరైనా రూల్స్ అతిక్రమించి ఇష్టమొచ్చినట్టు ప్రమోషన్స్ చేస్తే కన్స్యూమర్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరి ఇకనుంచైనా సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ యాడ్స్, ప్రమోషన్స్ చూసి చేస్తారేమో చూడాలి.