Dev Joshi : జపాన్ బిలియనీర్ జాబిల్లి యాత్రకి భారత నటుడు ఎంపిక..

జపాన్ బిలియనీర్ యుసాకు మేజవా జాబిల్లి పైకి స్పేస్‌ఎక్స్‌ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రని ఎప్పుడో ప్రకటించాడు యుసాకు. ఈ స్పేస్‌ఎక్స్‌ యాత్రకి తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టాడు. యుసాకు గతేడాది నుంచే...............

Dev Joshi : జపాన్ బిలియనీర్ జాబిల్లి యాత్రకి భారత నటుడు ఎంపిక..

Indian Actor Dev Joshi selected for japan Billionaire trip to the moon

Dev Joshi :  జపాన్ బిలియనీర్ యుసాకు మేజవా జాబిల్లి పైకి స్పేస్‌ఎక్స్‌ యాత్ర చేయనున్నారు. ఈ యాత్రని ఎప్పుడో ప్రకటించాడు యుసాకు. ఈ స్పేస్‌ఎక్స్‌ యాత్రకి తనతో పాటు తీసుకెళ్లడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సృజనాత్మక వ్యక్తుల కోసం అన్వేషణ చేపట్టాడు. యుసాకు గతేడాది నుంచే తన ట్విట్టర్ ద్వారా ఈ యాత్రకి క్రూ సభ్యులని ఎంచుకోవడం మొదలుపెట్టాడు. దీనికి దాదాపు 10 లక్షల మంది అప్ప్లై చేసినట్టు సమాచారం.

యుసాకు ఇంతమందిలో వడపోసి ఇప్పటివరకు 10 మందిని ఎంచుకున్నాడు. వీరిలో ఎక్కువగా క్రీడాకారులు, కళాకారులే ఉన్నారు. యుసాకు ఈ స్పేస్‌ఎక్స్‌ యాత్రకి ఎంచుకున్న వారిలో ఓ భారత నటుడికి స్థానం దక్కింది. ఇటీవలే తన స్పేస్‌ఎక్స్‌ యాత్రలో భారతీయ నాయుడు దేవ్ జోషిని ఎంచుకున్నట్టు ప్రకటించాడు. దేవ్ జోషి చిన్నప్పట్నుంచి పలు సీరియల్స్, సినిమాల్లో బాలీవుడ్ లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఇతనికి కేవలం 22 సంవత్సరాలే.

యుసాకు తన స్పేస్‌ఎక్స్‌ యాత్రకి ఎంచుకున్న వారిలో దేవ్ జోషితో పాటు అమెరికన్‌ డీజే స్టీవ్‌ అయెకి, కొరియాన్‌ స్టార్‌ టీవోపీ (చోంగ్‌ సెయుంగ్‌ హ్యూన్‌), చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన డ్యాన్సర్‌ యేమీ ఎ.డి., ఐర్లాండ్‌కు చెందిన రియాన్నోన్‌ ఆడమ్‌, అమెరికా యూట్యూబర్‌ టిమ్ డోడ్డ్‌, యూకేకు చెందిన ఫొటోగ్రాఫర్‌ కరీమ్‌ ల్లియ, అమెరికాకు చెందిన దర్శకుడు బ్రెండన్‌ హాల్‌, స్నోబోర్డర్‌ కైట్లిన్‌ ఫారింగ్టన్‌, జపాన్‌ డ్యాన్సరు మియూ ఉన్నారు.

Sankranthi Movies : ఈ సంక్రాంతి వార్ చాలా రేర్.. రెండు సినిమాలు.. ఒకే నిర్మాణ సంస్థ.. ఒకే హీరోయిన్..

ఈ స్పేస్‌ఎక్స్‌ యాత్ర వచ్చే ఏడాది జరగొచ్చని భావిస్తున్నారు. ఈ యాత్ర జరిగితే 1972 తర్వాత మానవ సహిత జాబిల్లి యాత్ర ఇదే కావొచ్చు. ఈ యాత్రలో వీరు చందమామకు 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్య వరకు వెళ్తారు. ఈ యాత్రకి మొత్తం 8 రోజుల సమయం పడుతుంది. ఈ యాత్రకి ఉపయోగించే స్టార్ షిప్ రాకెట్ కి, భూభ్రమణ పరీక్షకి అమెరికా నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు రావాల్సి ఉంది.