హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ : దేవిశ్రీ మ్యూజికల్ విషెస్ సూపర్

  • Published By: veegamteam ,Published On : August 22, 2019 / 06:42 AM IST
హ్యాపీ బర్త్ డే మెగాస్టార్ : దేవిశ్రీ మ్యూజికల్ విషెస్ సూపర్

మెగాస్టార్ చిరంజీవీకి ప్రముఖ సింగర్ దేవిశ్రీ ప్రసాద్ బర్త్ డే విషెస్ చెప్పిన తీరు అందరినీ ఎట్రాక్ట్ చేసింది. దేవీ..తన టీం తో కలిసి వీరిద్దిరి కాంబినేషన్ లో వచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో చిరుకి సూపర్‌ గా మ్యూజికల్‌ విషెస్‌ చేశారు. DSPతో పాటు హేమ చంద్ర, శ్రావణ భార్గవి ఇంకా టీం అందరూ చిరుకి ఎవరి స్టైల్లో వారు విషెస్ తెలిపారు.

అంతేకాదు మా డియరెస్ట్ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి సూపర్ డూపర్ మ్యూజికల్ హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేస్తూ.. ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో శంకర్ దాదా ఎంబీబీఎస్ పాటతో చిరుకి విష్ చేశారు. తర్వాత సైరా మూవీ గురించి మాట్లాడుతూ.. సర్ మీ సైరా టీజర్ అదిరిపోయింది సార్.. ఇట్స్ ఔట్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫ్యాన్స్ అందరిలాగానే మేం కూడా సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాం సార్ అని తెలిపారు.

ఇక ఇటీవల రిలీజైన సైరా టీజర్ అభిమానుల అంచనాలను భారీగా పెంచేసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మించారు.  అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా  గ్రాండ్ రిలీజ్ కానుంది.