Devi Sri Prasad: ‘దృశ్యం’ సినిమాకు దేవిశ్రీ వాయింపుడు.. బాక్సులు బద్దలవ్వాల్సిందే!

మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్‌లో దృశ్యం-2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. దృశ్యం-2 సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

Devi Sri Prasad: ‘దృశ్యం’ సినిమాకు దేవిశ్రీ వాయింపుడు.. బాక్సులు బద్దలవ్వాల్సిందే!

Devi Sri Prasad To Give Music For Drishyam 2 Hindi Movie

Devi Sri Prasad: మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు ‘దృశ్యం’, ‘దృశ్యం-2’ ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలను ఇప్పటికే ఇతర భాషల్లోనూ రీమేక్ చేసి, అక్కడ కూడా హిట్ అందుకున్నార. కాగా, తెలుగులో ఈ రెండు సినిమాల్లోనూ విక్టరీ వెంకటేష్ హీరోగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇక హిందీలో హీరో అజయ్ దేవ్గన్ తొలిభాగం ‘దృశ్యం’ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

Devi Sri Prasad: అరగంటలో 6 పాటలు కంపోజ్ చేసిన దేవిశ్రీ.. ఏ సినిమా కోసమంటే?

ఇప్పుడు బాలీవుడ్‌లో దృశ్యం-2 సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇందులోనూ తొలిభాగం దృశ్యం సినిమాలో నటించిన మెజారిటీ నటీనటులు నటిస్తున్నారు. కాగా, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అప్డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న దృశ్యం-2 సినిమాకు టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇప్పటికే తనదైన మ్యూజిక్‌తో దక్షిణాదిన టాప్ స్థానాన్ని సొంతం చేసుకున్న దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు ఓ బాలీవుడ్ మూవీకి ఫుల్ ఫ్లెడ్జ్‌గా సంగీతం అందిస్తుండటంతో, దృశ్యం-2 చిత్రానికి ఆయన ఇచ్చే మ్యూజిక్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Devi Sri Prasad: రఫ్పాడిస్తున్న రాక్ స్టార్.. డిఎస్పి బౌన్స్ బ్యాక్ అయినట్లేనా?

ఇక హిందీ దృశ్యం-2 చిత్రాన్ని అభిషేక్ పాఠక్ తెరకెక్కిస్తుండగా, శ్రియా సరన్, టబూ, అక్షయ్ ఖన్నా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. పనోరమ స్టూడియోస్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాను నవంబర్ 18న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.