Devotional / Mythology Movies : దేవుడ్ని నమ్ముకుంటున్న హీరోలు.. హిట్ కావాలంటే దేవుడే దిక్కు..

ఇటీవల యాక్షన్, లవ్, డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ.. ఇలా ఏ సినిమాలూ ఇండస్ట్రీని బతికించలేకపోతున్నాయి. సినిమాలకు మంచి రోజులు తేలేకపోతున్నాయి. అందుకే ఆ దేవుడ్నేనమ్ముకుంటున్నారు. ఆఖరికి అందరికీ.............

Devotional / Mythology Movies : దేవుడ్ని నమ్ముకుంటున్న హీరోలు.. హిట్ కావాలంటే దేవుడే దిక్కు..

Devotional / Mythology Movies :  ఇటీవల యాక్షన్, లవ్, డ్రామా, ఫ్యామిలీ, థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ.. ఇలా ఏ సినిమాలూ ఇండస్ట్రీని బతికించలేకపోతున్నాయి. సినిమాలకు మంచి రోజులు తేలేకపోతున్నాయి. అందుకే ఆ దేవుడ్నేనమ్ముకుంటున్నారు. ఆఖరికి అందరికీ దేవుడే దిక్కయ్యాడు. స్టార్ హీరోల దగ్గరనుంచి యంగ్ హీరోల వరకూ అందరూ ఆ దేవుడి మీదే భారం వేసి ఆయనే అన్నీ చూసుకుంటాడంటున్నారు.

లవ్ స్టోరీల్లో అవే పాటలు, అదే రొమాన్స్, అదే డ్రామా. యాక్షన్ సినిమాల్లో అదే ఫైట్లు, అదే మాస్ డ్రామా, ఎలివేషన్. ఇలా ఏ జానర్ లో సినిమాలు తీసినా డిజాస్టర్లే అవుతున్నాయి. మైథాలజీ, డివోషనల్ అనే ఎలిమెంట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర కాసులు కురిపిస్తోంది. రాజమౌళి కూడా మైథాలజీ, డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో ముందు ముందు చాలా సినిమాలు వస్తాయని, ఈ జానర్ అందరికీ ఇంట్రస్ట్ అని చెబుతున్నారు. అందుకే భారం మొత్తం దేవుడి మీదే వేశారు. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ అయిన బాలకృష్ణ అఖండ సినిమా దగ్గరనుంచి రాబోతున్న ఆదిపురుష్ వరకూ అందరూ దేవుడి మీదే సక్సెస్ భారం వేశారు.

మైథాలజీ, డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది కార్తికేయ 2. దేవుడ్ని నమ్మే ప్రతి వాళ్లకి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ద్వారక కృష్ణుడి రహస్యాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కార్తికేయ 2 మైథాలజీ, డివోషనల్ బేస్డ్ మూవీగా సూపర్ డూపర్ హిట్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

MMA Game : విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో చూపించిన MMA ఆట గురించి మీకు తెలుసా?

స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ మైథాలజీ, డివోషనల్ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ వరసగా దేవుడ్నే హిట్ ఫార్ములాగా తెరమీదకి తీసుకొస్తున్నారు. విశ్వమంతా నిండి ఉన్న శివుడి గురించి, ఆయన అస్త్రాల గురించి తెరకెక్కిన సినిమా బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్, నాగార్జున లాంటి భారీ స్టార్ కాస్ట్ తో 3 పార్టులుగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర మొదటి పార్ట్ సెప్టెంబర్ 9న ధియేటర్లోకొస్తోంది.

Karthikeya 2 : నిఖిల్ ఏంటి..? బాలీవుడ్ కి వెళ్లడమేంటి..?.. కర్నూలు గడ్డ మీద కార్తికేయ 2 వంద కోట్ల సెలబ్రేషన్స్.. స్పీచ్ అదరగొట్టిన నిఖిల్

ఇప్పటి వరకూ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్లు, సోషియో ఫాంటసీ సినిమాలు, బ్యూటిఫుల్ లవ్ స్టోరీలతో అన్ని జానర్లు టచ్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా దేవుడ్నే నమ్ముకున్నారు. ఈ సారి డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో ఆదిపురుషుడుగా రాముడి క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ ఫస్ట్ లుక్ కే ఫుల్ ఇంప్రెస్ అయిపోయారుఫాన్స్. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారంటీ అని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫాన్స్. ఏ దిక్కు లేని వాళ్లకి దేవుడే దిక్కు అన్నట్టు ఇప్పుడు సినిమా పరిశ్రమకి హిట్స్ కోసం దేవుడే దిక్కయ్యాడు. రాజమౌళి చెప్పినట్టు భవిష్యత్తులో మరిన్ని దేవుడి సినిమాలు వస్తే మంచిదే. మన భావితరాలకు మన సంసృతి, చరిత్ర, సాంప్రదాయాలు తెలిపినట్టు కూడా ఉంటుంది.