Das Ka Dhamki : దాస్ కా ధమ్కీ సినిమాకు వెళ్తే ధమాకా సినిమా వేశారు.. వైరల్ అవుతున్న వీడియో..
ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ బదులు రవితేజ ధమాకా సినిమా వేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో మార్కింగ్ షోకి అభిమానులు వెళ్లగా దాస్ కా ధమ్కీ సినిమా..................

Dhamaka Movie played instead of Das Ka Dhamki Movie video goes viral
Das Ka Dhamki : యువ హీరో విశ్వక్ సేన్(Vishwaksen) వరుస సినిమాలతో, సక్సెస్ లతో మంచి జోష్ లో ఉన్నాడు. నేడు ఉగాది రోజున దాస్ కా ధమ్కీ(Das Ka Dhamki) అనే మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాక దర్శకత్వం, నిర్మాణం కూడా విశ్వక్ చేయడం గమనార్హం. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేశాడు విశ్వక్. ఇందులో నివేతా పేతురేజ్(Nivetha Pethuraj) హీరోయిన్ గా నటించింది. ఇక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రావడం, ప్రమోషన్స్ భారీగా చేయడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా రిలీజ్ కావడంతో విశ్వక్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు థియేటర్స్ లో సందడి చేశారు. అయితే ఓ థియేటర్ లో దాస్ కా ధమ్కీ బదులు రవితేజ ధమాకా సినిమా వేయడంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. వైజాగ్ లోని సుకన్య థియేటర్ లో మార్కింగ్ షోకి అభిమానులు వెళ్లగా దాస్ కా ధమ్కీ సినిమా బదులు ధమాకా సినిమా స్క్రీన్ పై వచ్చింది. దీంతో అంతా ఆశ్చర్యపోయి అరవడం మొదలుపెట్టారు. కొన్ని నిముషాలు ధమాకా సినిమానే ప్లే అయింది. ఆపరేటర్ తప్పుని గుర్తించి వెంటనే దాస్ కా ధమ్కీ సినిమాని వేశాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Allari Naresh 61 : అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా కొత్త సినిమా.. మళ్ళీ పాత పంథాలోకి నరేశ్?
ఈ వీడియోని షేర్ చేస్తూ ఆ థియేటర్ యాజమాన్యాన్ని, ఆపరేటర్ ని ట్రోల్ చేస్తున్నారు విశ్వక్ అభిమానులు. దీనిపై ఆ థియేటర్ మేనేజ్మెంట్ వివరణ ఇస్తూ.. రెండు టైటిల్స్ కొంచెం ఒకేలా ఉండటంతో ప్లే చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాము అని చెప్పడం గమనార్హం. ఇక ధమాకా సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది.
In Andhra instead of playing #DasKaDamki movie played Ravi Tejas #Dhamaka today🤣🤣😂@VishwakSenActor #DhamkiOnMarch22 #RaviTeja pic.twitter.com/v8Jv5DbQ8Z
— Lokesh_Kuruba (@KurubaraHuduga) March 22, 2023
Dhamki Ki Badhulu Dhamaka Vesaru 😂😂 @RaviTeja_offl #Dhamki #Dhamaka pic.twitter.com/R5gkfpSz7A
— Mass Maharajh Venky RTF 45 (@PolapellyVenky) March 22, 2023
Morning morning ugadhi pachadi anukoni 90 vesenatunaru 😂😂 #Dhamaka #Dhamki #DasKaDhamki@VishwakSenActor @RaviTeja_offl pic.twitter.com/9nUJNcdIHU
— Evadiki_vaade_thopu (@evadikivadethop) March 22, 2023
DHAMKI ,DHAMAKA CONFUSED
DHAMKI KI ANUKONI DHAMAKA VESADU 😂😂😂#DasKaDhamki #Dhamaka pic.twitter.com/dCtmKtOa5T— VENKATESH (@VenkateshPSPK5) March 22, 2023