Dhamaka : ధమాకా మరో సరికొత్త రికార్డు.. ఇండియా వైడ్ ట్రెండింగ్..

ధమాకా సినిమా థియేటర్స్ లో దాదాపు 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. దీంతో రవితేజకి ఫస్ట్ 100 కోట్ల సినిమాగా ధమాకా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక థియేట్రికల్ రన్ అయిన తర్వాత ధమాకా సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇటీవలే వచ్చింది..............

Dhamaka : ధమాకా మరో సరికొత్త రికార్డు.. ఇండియా వైడ్ ట్రెండింగ్..

Dhamaka movie trending in Netflix nation wide

Dhamaka :  రవితేజ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ధమాకా సినిమా ఎంత భారీ విజయం సాధించిందో అందరికి తెలిసిందే. క్రాక్ సినిమా తర్వాత వెంటవెంటనే రెండు ఫ్లాప్స్ పడటంతో రవితేజ అభిమానులు నిరాశ చెందారు. కానీ ధమాకా తో సాలిడ్ గా తిరిగొచ్చి భారీ హిట్ ఇచ్చాడు మాస్ మహారాజ. ధమాకా సినిమా థియేటర్స్ లో రచ్చ రచ్చ చేసింది. సాంగ్స్, కామెడీ సీన్స్, శ్రీలీల మాస్ డ్యాన్స్, రవితేజ ఎనర్జీ.. ఇలా అన్ని అంశాలతో ధమాకా సినిమా థియేటర్స్ లో ప్రేక్షకులని మెప్పించి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి రవితేజకి మొట్టమొదటి 100 కోట్ల సినిమా ఇచ్చింది.

ధమాకా సినిమా థియేటర్స్ లో దాదాపు 110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసింది. దీంతో రవితేజకి ఫస్ట్ 100 కోట్ల సినిమాగా ధమాకా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక థియేట్రికల్ రన్ అయిన తర్వాత ధమాకా సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి ఇటీవలే వచ్చింది. జనవరి 22 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. థియేటర్స్ లో రికార్డులు సెట్ చేసిన ధమాకా సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది.

Pathaan : పఠాన్ వల్ల 32 ఏళ్ళ తర్వాత మళ్ళీ అక్కడ హౌస్ ఫుల్.. షారుఖ్ మేనియా..

ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ ఇండియాలో ఎక్కువగా చూస్తున్న సినిమాలో రెండో స్థానంతో ట్రెండింగ్ లో ఉంది ధమాకా. సినిమా రిలీజయి దాదాపు ఆరు రోజులు అవుతున్నా ఇంకా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతుంది ఈ సినిమా. దీన్ని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో చిత్రయూనిట్, మాస్ మహారాజ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.