Dhamaka: వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోన్న మాస్ రాజా ‘ధమాకా’!

మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు తొలిరోజు మిక్సిడ్ టాక్ వచ్చినా, ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

Dhamaka: వంద కోట్ల దిశగా పరుగులు పెడుతోన్న మాస్ రాజా ‘ధమాకా’!

Dhamaka Running Towards 100 Cr Club

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన తాజా చిత్రం ‘ధమాకా’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ సినిమాకు తొలిరోజు మిక్సిడ్ టాక్ వచ్చినా, ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.

Dhamaka: రవితేజ తప్ప ఎవరు చేసినా ‘ధమాకా’ ఫ్లాప్.. బండ్ల గణేష్ కామెంట్స్!

దర్శకుడు నక్కిన త్రినాథరావు తెరకెక్కించిన ఈ సినిమాలో మాస్ రాజా మరోసారి తనదైన అల్టిమేట్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చాలా కాలం తరువాత రవితేజకు పక్కా కమర్షియల్ పాత్ర దక్కిందని.. అందులో ఆయన నటన మాస్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని చిత్ర యూనిట్ అంటోంది. ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు వస్తుండటంతో ఈ సినిమా చాలా త్వరగా రూ.50 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది. అంతేగక, ఈ సినిమాకు రానురాను కలెక్షన్స్ పెరుగూ వెళ్తున్నాయి.

Dhamaka: రవితేజ కెరీర్‌లోనే అక్కడ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ధమాకా!

ఈ సినిమా కేవలం 10 రోజుల్లోనే రూ.89 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించి రవితేజ కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాలేమీ లేకపోవడంతో, ప్రేక్షకులు ధమాకా సినిమాను చూసేందుకే ప్రాధాన్యత ఇస్తుండటంతో ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రవితేజ నటించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు.