Dhamaka Movie: బుల్లితెరపై మాస్ రాజా ధమాకా.. ఎప్పుడంటే?

మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చేలా చేసింది.

Dhamaka Movie: బుల్లితెరపై మాస్ రాజా ధమాకా.. ఎప్పుడంటే?

Dhamaka To Be Premiered As World Television Premiere

Dhamaka: మాస్ రాజా రవితేజ నటించిన రీసెంట్ మూవీ ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు నక్కిన త్రినాథరావు పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను ఈ సినిమా కోసం థియేటర్లకు వచ్చేలా చేసింది. ఇక మాస్ రాజా రవితేజ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్, ఆయన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.

Dhamaka : ధమాకా మరో సరికొత్త రికార్డు.. ఇండియా వైడ్ ట్రెండింగ్..

దీంతో ఈ సినిమా కమర్షియల్‌గానూ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపింది. ఇక ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయగా, అందులోనూ ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమాను ఇప్పుడు బుల్లితెరపై టెలికాస్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ప్రముఖ ఛానల్ స్టార్ మా లో ధమాకా మూవీని మార్చి 26న సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Dhamaka: ఓటీటీలో పేలిన మాస్ బాంబ్.. ధమాకా సౌండ్ అదిరిందట!

ఈ సినిమాకు బుల్లితెరపై కూడా అదిరిపోయే రెస్పాన్స్ రావడం ఖాయమని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తు్న్నాయి. ఇక ఈ సినిమాలో రవితేజ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటించగా, భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందించాడు. మరి థియేటర్స్, ఓటీటీల్లో దుమ్ములేపిన ధమాకా మూవీకి బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను అందిస్తారో చూడాలి.