Dhanush-Aishwarya : 21 ఏళ్లకే ధనుష్‌కి పెళ్లి.. ఐశ్వర్య‌కి ఎంత ఏజ్ తెలుసా??

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఫేమస్ కపుల్. అయితే వీరిద్దరూ తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు వారి....

Dhanush-Aishwarya : 21 ఏళ్లకే ధనుష్‌కి పెళ్లి.. ఐశ్వర్య‌కి ఎంత ఏజ్ తెలుసా??

Dhanush

Dhanush-Aishwarya :  కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఫేమస్ కపుల్. అయితే వీరిద్దరూ తాజాగా విడిపోతున్నట్లు ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్లు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 18ఏళ్ల పాటు కొనసాగిన తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. రెండు రోజుల నుంచి వీరి విడాకులు వార్తల్లో నిలుస్తున్నాయి.

ఇప్పుడు వీరు విడాకులు తీసుకోవడంతో వీళ్ల పెళ్లి గురించి మళ్ళీ అందరూ మాట్లాడుకుంటున్నారు. 18 ఏళ్ళ క్రితం వీరికి పెళ్లి అయినప్పుడు వీరి జంట వార్తల్లో నిలిచింది. అందుకు కారణం వీరే ఏజ్. తమిళ దర్శకుడు, నిర్మాత కస్తూరిరాజా రెండో కొడుకు ధనుష్‌. ధనుష్ పెళ్లి టైంకి స్టార్ కూడా కాదు. కేవలం రెండు సినిమాలు చేశాడు. అయితే అప్పటికే ధనుష్, ఐశ్వర్య మంచి స్నేహితులు. ఓ సినిమా ప్రివ్యూలో కలుసుకున్న వీరిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత రెగ్యులర్ గా కలుస్తూ ఉండేవారు. ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రజినీకాంత్ కూడా వీరి వివాహానికి ఒప్పుకున్నారు.

Sonal Chauhan : ‘ఘోస్ట్’ సినిమా నుంచి తప్పుకున్న కాజల్, జాక్వెలిన్.. బాలయ్య హీరోయిన్‌తో నాగార్జున..

దీంతో 2004లో ధనుష్, ఐశ్వర్యల వివాహం జరిగింది. వివాహం జరిగే సమయానికి ధనుష్ వయసు కేవలం 21 ఏళ్లే. ఇక ఐశ్వర్య ధనుష్ కంటే రెండు సంవత్సరాలు పెద్ద అవ్వడం గమనార్హం. వీరి పెళ్లి సమయానికి ఐశ్వర్య ఏజ్ 23 ఏళ్లు. దీంతో ఈ పెళ్లి అప్పట్లోనే వార్తల్లో నిలిచింది. 18ఏళ్ల పాటు కొనసాగిన వీరి దాంపత్య జీవితం ఇప్పుడు విడిపోయినట్లు ప్రకటించడంతో చర్చనీయాంశంగా మారింది.