Dhanush-Aishwarya : ఒకే హోటల్ లో ఐశ్వర్య.. ధనుష్.. ఎడమొహం.. పెడమొహం..

ఐశ్వర్య, రజినీకాంత్ ఇవేమి పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు. తాజాగా ఐశ్వర్య, రజినీకాంత్ ఒకే హోటల్ లో ఉండాల్సి వచ్చింది. ధనుష్‌ తెలుగులో తీస్తున్న 'సర్' సినిమా..........

Dhanush-Aishwarya :  ఒకే హోటల్ లో ఐశ్వర్య.. ధనుష్.. ఎడమొహం.. పెడమొహం..

Dhanush Aishwarya

Dhanush-Aishwarya :  తమిళ్ స్టార్ హీరో ధనుష్‌ ఇటీవల రజినీకాంత్ కూతురు ఐశ్వర్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ళ వీళ్ళ ప్రయాణాన్ని ఇటీవల ముగించారు. ఇద్దరూ తమ సోషల్ మీడియాలో అధికారిక పోస్టులు పెట్టి విడిపోయారు. ధనుష్, ఐశ్వర్య విడాకులు వారి అభిమానులకు బాధని కలిగించాయి. వీరి విడాకులపై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కానీ ఐశ్వర్య, రజినీకాంత్ ఇవేమి పట్టించుకోకుండా తమ పనులు తాము చేసుకుంటున్నారు. తాజాగా ఐశ్వర్య, రజినీకాంత్ ఒకే హోటల్ లో ఉండాల్సి వచ్చింది.

Malaika Arora : నేనేం బట్టలు వేసుకోవాలో నాకు తెలుసు

ధనుష్‌ తెలుగులో తీస్తున్న ‘సర్’ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌లో ఉన్నారు. ఈ షూటింగ్ ఇక్కడే రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ధనుష్ కూడా ఇక్కడే బస చేస్తున్నాడు. రామోజీ ఫిలింసిటీలో ఉన్న ఓ హోటల్ లోనే ధనుష్ బస చేస్తున్నాడు. అయితే తాజాగా ఐశ్వర్య కూడా ఓ సాంగ్‌ చిత్రీకరణ కోసం హైదరాబాద్ కి వచ్చింది. ఈ సాంగ్ చిత్రీకరణ మొత్తం రామోజీ ఫిలింసిటీలోనే అని సమాచారం. దీంతో ఐశ్వర్య కూడా రామోజీ ఫిలింసిటీలో ఉన్న అదే హోటల్ లో ఉండాల్సి వచ్చిందట. దీంతో ఇద్దరూ ఒకే హోటల్ లో ఉంటున్నారు ప్రస్తుతం. కానీ ఎవరి పనులు వారివి అన్నట్టు ఒకరి గురించి ఒకరు ఆలోచించకుండా ఎడమొహం పెడమొహం అన్నట్టు ఉంటున్నారట.