చివరి షెడ్యూల్‌లో అసురన్

అసురన్ షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా అసురన్ నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్..

  • Published By: vamsi ,Published On : April 29, 2019 / 01:41 PM IST
చివరి షెడ్యూల్‌లో అసురన్

అసురన్ షూటింగ్ చివరి షెడ్యూల్ ప్రారంభమైంది.. ఈ సందర్భంగా అసురన్ నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్..

తమిళ స్టార్ హీరో ధనుష్, మారి2 తర్వాత వెట్రి మారన్ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్నాడు. వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నాడు. ఇంతకుముందు ధనుష్, వెట్రి మారన్‌ల కాంబినేషన్‌లో మూడు సినిమాలొచ్చాయి. చివరిగా గతేడాది అక్టోబర్‌లో రిలీజ్ అయిన వడచెన్నై కూడా హిట్ అయ్యింది. వీళ్ళ కాంబోలో తెరకెక్కబోయే ఈ చిత్రానికి అసురన్ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. జనవరి నెలాఖరులో షూటింగ్ స్టార్ట్ అయిన సందర్భంగా, ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. ఒక పోస్టర్‌‌లో తమిళ నేటివిటీ ఉట్టిపడేలా పెద్దబొట్టుతో, మీసాలు మెలితిప్పి, లుంగీ పైకి ఎత్తికట్టి, చేతిలో బల్లెంతో ప్రత్యర్థుల మీదకి దూకుతున్నాడు ధనుష్.

మరో లుక్‌లో, పెద్ద మనిషి తరహాలో కాలుమీద కాలు వేసుకుని కుర్చీలో కూర్చుని ఉండగా, అతని భార్య పాత్రలో నటిస్తున్న మంజు వారియర్ పక్కన నిలబడి ఉన్న ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అసురన్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసురన్ నుండి ధనుష్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసారు. బ్యాక్‌గ్రౌండ్‌లో పోతురాజు విగ్రహం ఉండగా, చేతిలో నెత్తురోడుతున్న కత్తి, ముఖం మరియు చొక్కాపై రక్తంతో, రౌద్రంగా నడుచుకుంటూ వస్తున్నాడు ధనుష్. పక్కా మాస్ ఫార్మాట్‌లో డిజైన్ చేసిన ఈ పోస్టర్ తమిళ తంబీలను ఆకట్టుకుంటుంది. యోగిబాబు, తలైవాసల్ విజయ్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకి కెమెరా : వేల్‌రాజ్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్, సంగీతం:  జి.వి.ప్రకాష్ కుమార్.
Also Read : ఏబీసీడీ.. ‘మెల్ల మెల్లగా’ వీడియో సాంగ్..