Maaran : ధనుష్ ‘మారన్’ మోషన్ పోస్టర్ చూశారా..

‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్ లేటెస్ట్ మూవీ ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్..

10TV Telugu News

Maaran: కెరీర్ స్టార్టింగ్ నుండి స్టోరీ సెలక్షన్ పరంగా కొత్తదనం చూపిస్తూ, డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్లు చేస్తూ కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీల్లో వెర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, చిన్న వయసులోనే నాలుగు సార్లు నేషనల్ అవార్డ్ అందుకున్న నటుడిగా సెన్సేషన్ క్రియేట్ చేశారు ‘ఇళయ సూపర్‌స్టార్’ ధనుష్..

Mahesh Babu : మహేష్ బాబుకి నెగెటివ్..

ఇప్పుడాయన తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో వెంకీ అట్లూరి డైరెక్షన్‌‌లో ‘సార్’ అనే మరో సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

Bangarraju : రివ్యూ..

తమిళ్‌లో ధనుష్, మాళవికా మోహనన్ జంటగా కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘మారన్’ అనే ఓ సినిమా రూపొందుతుంది. ధనుష్ హీరోగా నటిస్తున్న 43వ సినిమా ఇది. సంక్రాంతి సందర్భంగా ‘మారన్’ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ధనుష్ డిఫరెంట్ గెటప్‌లో సరికొత్తగా కనిపిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతమందిస్తున్నారు.

×