Dhanush SIR movie : సార్ సినిమాతో సరికొత్త రికార్డు.. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సార్..

ధనుష్ సార్ సినిమా రిలీజయి నేటికి నెల రోజులు అయింది. నేటి నుంచి సార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సార్ సినిమా థియేట్రికల్ రన్ ముగించింది. ధనుష్ సార్ సినిమా మొత్తం నెల రోజుల థియేట్రికల్ రన్ లో....................

Dhanush SIR movie : సార్ సినిమాతో సరికొత్త రికార్డు.. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా సార్..

Dhanush SIR movie collects highest collections in Dhanush Career

Dhanush SIR movie :  ధనుష్, సంయుక్త జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మంచి విజయం సాధించింది. ముఖ్యంగా సార్ సినిమా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి చెప్పడం, మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చూపించడం, ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా భారీ హిట్ అయింది.

ధనుష్ సార్ సినిమా తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవ్వడంతో పాటు, కంటెంట్ కూడా అందరికి నచ్చడంతో మూడు రోజుల్లోనే 50 కోట్ల కలెక్షన్స్ సాధించి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. సార్ సినిమా ఇటీవలే 100 కోట్ల కలెక్షన్స్ దాటింది. గతంలో ధనుష్ తిరు సినిమా లాంగ్ రన్ లో 110 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మంచి విజయం సాధించింది. ఇప్పుడు సార్ సినిమా ఆ రికార్డుని బద్దలుకొట్టింది.

Kabjaa : ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి, కబ్జ సినిమాలు ఏ ఓటీటీలో రానున్నాయో తెలుసా?

ధనుష్ సార్ సినిమా రిలీజయి నేటికి నెల రోజులు అయింది. నేటి నుంచి సార్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో సార్ సినిమా థియేట్రికల్ రన్ ముగించింది. ధనుష్ సార్ సినిమా మొత్తం నెల రోజుల థియేట్రికల్ రన్ లో 118 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సినిమాతో ధనుష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సార్ నిలిచింది. ఈ విషయాన్ని అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించింది. బ్యాక్ టు బ్యాక్ ధనుష్ కి 100 కోట్ల సినిమాలు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.