Sir Review : మెసేజ్‌కి మాస్ జోడించి హిట్ కొట్టిన ధనుష్.. అందరికి చదువు అందాలనే ‘సార్’ ప్రయత్నం

సార్ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేశారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ అని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ముందు నుంచే చెప్తూ సినిమాని ప్రమోట్ చేశారు. ప్రీమియర్ షోలు ప్రకటించిన కొన్ని నిమిషాలకే.............

Sir Review : మెసేజ్‌కి మాస్ జోడించి హిట్ కొట్టిన ధనుష్.. అందరికి చదువు అందాలనే ‘సార్’ ప్రయత్నం

sir review

Sir Review :  ధనుష్, సంయుక్త జంటగా దర్శకుడు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సార్ సినిమా తెరకెక్కింది. ధనుష్ మొదటి సారి డైరెక్ట్ తెలుగు సినిమా చేశాడు. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ ని కూడా రెండు రాష్ట్రాల్లో గ్రాండ్ గా చేశారు. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.

సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేశారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్ అని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని ముందు నుంచే చెప్తూ సినిమాని ప్రమోట్ చేశారు. ప్రీమియర్ షోలు ప్రకటించిన కొన్ని నిమిషాలకే టికెట్స్ అన్నీ అయిపోయాయి. ప్రీమియర్ షో నుంచి టాక్ అదిరిపోయింది. సినిమా చూసిన వాళ్లంతా అద్భుతమైన సినిమా అని పొగుడుతున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో కూడా షో పడి అంతటా పాజిటివ్ టాక్ వస్తుంది. చదువుకు ఉన్న వ్యాల్యూని చాలా బాగా చూపించారని అంటున్నారు. ఇక ధనుష్ అభిమానులు అయితే సినిమా సూపర్ హిట్ అయినందుకు పండగ చేసుకుంటున్నారు.

సార్ కథ విషయానికి వస్తే.. ఓ ఇంటర్ చదివే కుర్రాడికి వాళ్ళ తాత వీడియో షాప్ ఖాళీ చేస్తుంటే ఎంసెట్ కోచింగ్ కి సంబంధించిన కొన్ని వీడియో క్యాసిట్స్ కనిపిస్తాయి. వీళ్ళ కాలేజీలో కంటే అందులో చాలా బాగా చెప్పడంతో ఆ క్యాసిట్స్ లో కోచింగ్ చెప్పింది ఎవరు అని దాంట్లో ఉన్న స్లిప్ ఆధారంగా వెతుక్కుంటూ వెళ్తారు. అలా ఓ జిల్లా కలెక్టర్ (హీరో సుమంత్) దగ్గరికి వెళ్లడంతో సుమంత్.. మా బాలు సార్ అని 1999లో జరిగిన కథ చెప్పడం మొదలుపెడతాడు. 1999 లో అప్పుడప్పుడే విద్య ప్రైవేట్ రంగం చేతుల్లోకి వెళ్లి ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంసెట్ కోచింగ్ సెంటర్లు వస్తున్నాయి, దానివల్ల ప్రభుత్వ కాలేజీలకు ఎవరు వెళ్ళకపోవడం, టీచర్లు కూడా ఎక్కువ జీతాలకు ఆశపడి ప్రైవేట్ కాలేజీలకు వెళ్లడంతో ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ విధానం తెచ్చే ఆలోచనలో ఉందని త్రిపాఠి విద్యాసంస్థల అధినేత (సముద్రఖని)కు తెలిసి తమ విద్యా వ్యాపారం దెబ్బ తినకూడదని గవర్నమెంట్ కాలేజిలని దత్తత తీసుకొని మా కాలేజీలలో టీచర్లని చదువులు చెప్పడానికి పంపిస్తాము అని చెప్పి జూనియర్ లెక్చరర్స్ ని పంపిస్తాడు. అలా ఆ విద్యాసంస్థలోనే జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్ గా పనిచేసే ధనుష్ ఓ ఊర్లోని గవర్నమెంట్ కాలేజీలో పనిచేయడానికి వెళ్తాడు. ధనుష్ తో పాటు, ఆది, మరో కమెడియన్ వెళ్తారు. అప్పటికే అక్కడ హీరోయిన్, తనికెళ్ళ భరణి.. ఇలా పలువురు ఆ స్కూల్ లో లెక్చరర్స్ గా పనిచేస్తారు. కానీ అక్కడికి స్టూడెంట్స్ రారని, అందరు పేదవాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు అని తెలుసుకొని, వాళ్ళు పనులకు వెళ్తారని తెలుసుకొని ధనుష్ వాళ్ళ పేరెంట్స్ తో మీటింగ్ పెట్టి ఊరి ప్రెసిడెంట్ (సాయి కుమార్)తో కూడా మాట్లాడి అందర్నీ కాలేజీకి వచ్చేలా చేస్తాడు. ధనుష్ స్టూడెంట్స్ కి చాలా దగ్గరవుతాడు. మొదటి హాఫ్సం అంతా కామెడీ, స్టూడెంట్స్, సార్ మధ్య రిలేషన్ చూపిస్తారు. ఆ సంవత్సరం పరీక్షల్లో ఆ గవర్నమెంట్ కాలేజీ అంతా పాస్ అవ్వడంతో త్రిపాఠి ఇది తనకి నష్టమని భావించి ధనుష్ ని నాకే ఎసరు పెట్టేలా ఉన్నవని తిడతాడు, చదువుని వ్యాపారంగా మాట్లాడటంతో ధనుష్ కి కోపం వచ్చి అందరికి ఎంసెట్ ర్యాంక్స్ వచ్చేలా చేస్తా అని బెట్ కడతాడు. దీంతో త్రిపాఠి ఏం చేశాడు? ధనుష్ ని ఆ ఊరినుంచి, ఆ కాలేజీ నుంచి, ఆ స్టూడెంట్స్ నుంచి ఎలా దూరం చేశాడు అనే దాంతో చాలా ఇంట్రెస్టింగ్ గా మొదటి హాఫ్ ని పూర్తి చేశాడు డైరెక్టర్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, ధనుష్ ఏం చేస్తాడు, పిల్లలు చదువుకుంటారా లేదా అనే ఆత్రుతతో ఉంటారు ప్రేక్షకులు ఇక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ అప్పటికే ప్రేమలో ఉండటంతో ధనుష్ దగ్గరికి వచ్చేసి పెళ్లి చేసుకుంటానని, ఆ పిల్లలు చదువుకి దూరం అయ్యారని, వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యి అని ధనుష్ ని అడగడంతో మొదట నా వాళ్ళ కాదు అని చెప్పినా తర్వాత ఒప్పుకొని ఎలా పిల్లలకు మళ్ళీ దగ్గరయ్యాడు, ఎలా వాళ్లకు చదువు చెప్పాడు, మళ్ళీ త్రిపాఠి నుంచి వచ్చే సమస్యలని ఎలా తప్పించుకున్నాడు? ధనుష్ కి ఎవరు సపోర్ట్ చేశారు? చివరికి పిల్లలు చదువుకున్నారా? మరి ఇప్పుడు బాలు సార్ ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు? అనేది సెకండ్ హాఫ్ లో చాలా ఎమోషనల్ గా నడిపించాడు దర్శకుడు. ఆ కథ తెరపై చూసి ఎమోషనల్ అవ్వాల్సిందే.

డైరెక్టర్ స్క్రీన్ ప్లేని అద్భుతంగా రాసుకున్నాడు. ఇలాంటి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలో కమర్షియల్ వ్యాల్యూలని కరెక్ట్ గా జత చేయడం, హీరో తాలూకు మాస్ ఎలిమెంట్స్, హీరోయిన్ లవ్, కామెడీ.. ఇలా అన్నీ కరెక్ట్ గా రాసుకున్నాడు. స్టోరీని చాలా బాగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించాడు. సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకుడు ఆ కథకి కనెక్ట్ అయి ఎమోషనల్ అవుతాడు. అంతేకాకుండా 40 మంది స్టూడెంట్స్ ని కెమెరా ముందు ఉంచుకొని దర్శకుడు ఎక్కడా తడబడకుండా అందరికి ఇంపార్టెన్స్ ఇస్తూ తీయడం చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఉన్న అందరి స్టూడెంట్స్ ని కథలో భాగం చేసి, వాళ్ళతో కూడా సినిమా నడపడం చాలా బాగుంటుంది. మన సొసైటీలో చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళు, అంతకు తక్కువ ఉన్నవాళ్లే ఉండటంతో ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. సినిమాలో చదువుకు ఉన్న వ్యాల్యూ, చదువుని ఎలా వ్యాపారం చేసేశారు అని చెప్పడం, పిల్లల్ని చదివించాలని అమ్మానాన్న ఆరాటపడటం.. ఇవన్నీ కూడా ప్రేక్షకులని, ముఖ్యంగా విద్యార్థులకు మన కథలాగే అనిపించేలా చేస్తాయి. కొన్ని సీన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఇప్పుడు సొసైటీలో చదువు ఎంతలా వ్యాపారం అయిందో చూస్తున్నాము. ఈ సినిమాలో ఇప్పటి విద్యా విధానానికి కౌంటర్ గా ఉంటుంది. చదువు అందరికి అందాలి, చదువు ఉంటేనే అంతా బాగుపడతారు అని చెప్పే సినిమా సార్.

ఇక పర్ఫార్మెన్స్ ల పరంగా ధనుష్ ఎప్పటిలాగే తన సూపర్ నటనతో ఆకట్టుకున్నాడు, కామెడీ, ఫైట్స్, ఎమోషన్ అన్నిట్లో అదరకొట్టేశాడు. స్టార్ హీరో అయినా ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేసి అందర్నీ మెప్పించాడు. ధనుష్ ఎలివేషన్ సీన్స్, మాస్ అంశాలు ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తాయి. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా లెక్చరర్ గా అద్భుతంగా నటించింది. చాలా పద్ధతి గల క్యారెక్టర్ లో నటించి యూత్ కి బాగా దగ్గరయి, అందరికి నచ్చేస్తుంది. భీమ్లా నాయక్, బింబిసార సినిమాల తర్వాత ఈ సార్ సినిమాతో కూడా సూపర్ హిట్ కొట్టి తెలుగులో హ్యాట్రిక్ కొట్టింది సంయుక్త. ఆది ఉన్న కాసేపు నవ్వించాడు. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో విలన్ గా మెప్పించిన సముద్రఖని ఇందులో కూడా ధనుష్ కి గట్టి పోటీ ఇచ్చాడు. 40 మంది స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేశారు. GV ప్రకాష్ మ్యూజిక్ అద్భుతంగా ఇచ్చాడు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఎమోషనల్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ లో సూపర్ ఇచ్చాడు. కెమెరా వర్క్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఫైట్స్ కూడా కొత్తగా ఉన్నాయి.

Sir Premieres : తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ‘సార్’ ప్రీమియర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సార్ ప్రీమియర్ షో టికెట్లు..

మొత్తానికి సార్ సినిమా సొసైటీలో అందరూ చదువుకోవాలి, అందరికి విద్య అందుబాటులో ఉండాలి, చదువుని వ్యాపారం చేయకూడదు అనే మంచి మెసేజ్ ని మాస్ అంశాలతో జోడించి ప్రేక్షకులకు అందించారు. దీంతో చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూశామని ప్రేక్షకులు, ధనుష్ అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ధనుష్ గత సినిమా తిరు కూడా మంచి విజయం సాధించింది. ఇప్పుడు సార్ సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు ధనుష్. రెండు భాషల్లో సినిమా కాబట్టి, సినిమా కూడా హిట్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఫైనల్ గా మెసేజ్‌కి మాస్ జోడించి, అందరికి చదువు దక్కాలని చెప్తూ ధనుష్ ‘సార్’ హిట్ కొట్టేశాడు.