Sir Movie : ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న సార్..

సాధారణంగానే అభిమానులు తమ హీరోల పుట్టిన రోజులు, సినిమా రిలీజ్ లు ఉన్నప్పుడు ట్విట్టర్ లో తెగ హడావిడి చేస్తారు. ఇక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అభిమానులు ట్విట్టర్లో హంగామా చేస్తారు. ఇప్పుడు ధనుష్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు. ధనుష్ సార్ సినిమా...........

Sir Movie : ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న సార్..

Dhanush Sir Movie trending in twitter india wide

Sir Movie :  ధనుష్, సంయుక్త హీరోహీరోయిన్స్ గా దర్శకుడు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్ నిర్మాణంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై సార్ సినిమా తెరకెక్కింది. సార్ సినిమాని తెలుగు, తమిళ్ లో బైలింగ్వల్ గా తెరకెక్కించారు. దీంతో ఇది ధనుష్ కి మొదటి తెలుగు సినిమా. ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా ప్రమోషన్స్ ని కూడా రెండు రాష్ట్రాల్లో గ్రాండ్ గా చేశారు. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఇక సార్ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో తెలుగు, తమిళ్ రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ముందు రోజు రాత్రే ప్రీమియర్ షోలు వేయడంతో ఇప్పటికే సూపర్ హిట్ టాక్ వచ్చింది.

చదువుకు ఉన్న విలువ గురించి అని, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయని చిత్రయూనిట్ ముందు నుంచే చెప్తూ సినిమాని ప్రమోట్ చేశారు. ఇక ప్రీమియర్ షో నుంచి టాక్ అదిరిపోయింది. సినిమా చూసిన వాళ్లంతా అద్భుతమైన సినిమా అని, ఎమోషనల్ గా కనెక్ట్ అవుతామని చెప్తున్నారు. సినిమా చుసిన వాళ్లంతా ట్విట్టర్ లో తమ భావాలని పంచుకుంటున్నారు. అలాగే ట్విట్టర్ లో ఇప్పుడు సార్ మూవీ ట్రెండింగ్ లో ఉంది.

Sir Review : మెసేజ్‌కి మాస్ జోడించి హిట్ కొట్టిన ధనుష్.. అందరికి చదువు అందాలనే ‘సార్’ ప్రయత్నం

సాధారణంగానే అభిమానులు తమ హీరోల పుట్టిన రోజులు, సినిమా రిలీజ్ లు ఉన్నప్పుడు ట్విట్టర్ లో తెగ హడావిడి చేస్తారు. ఇక సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటే అభిమానులు ట్విట్టర్లో హంగామా చేస్తారు. ఇప్పుడు ధనుష్ అభిమానులు కూడా అదే చేస్తున్నారు. ధనుష్ సార్ సినిమా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటం, ఇప్పటికే ప్రీమియర్స్ టాక్ తో సూపర్ హిట్ టక తెచ్చుకోవడంతో సార్ సినిమా ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. తమిళ్ లో వాతి పేరుతో రిలీజ్ అవుతుండటంతో వాతి కూడా ట్రెండింగ్ లో ఉంది. #sirmovie, #vaathi ట్యాగ్స్ రెండూ ఇండియా వైడ్ ట్రెండ్ అవ్వడం విశేషం.