Sir Movie Scenes : సార్ సినిమా.. తెలుగులో లేని సీన్స్ తమిళ్ లో.. సీన్స్ కట్ చేశారా??

సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ సినిమా రిలీజ్ కి ముందే బాగా వైరల్ అయి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఈ సాంగ్ హీరోయిన్ వైపు నుంచి ఉంటుంది. తమిళ్ లో వా వాతి అని ఈ సాంగ్ ఉండగా అక్కడ కూడా ఈ పాట మంచి విజయాన్ని సాంధించింది. తెలుగులో.............

Sir Movie Scenes : సార్ సినిమా.. తెలుగులో లేని సీన్స్ తమిళ్ లో.. సీన్స్ కట్ చేశారా??

Dhanush va vathi song released from sir movie some new scenes showed in this lyrical song goes viral

Sir Movie Scenes :  డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్, సంయుక్త జంటగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ల పై తెరకెక్కిన సినిమా సార్. సాంగ్స్, ట్రైలర్ సూపర్ టాక్ తెచ్చుకోవడంతో ముందునుంచే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. ఫిబ్రవరి 17న సార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజయి మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ కొట్టింది. సార్ సినిమాకు ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి ఈ సినిమాకు.

సార్ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ సినిమా రిలీజ్ కి ముందే బాగా వైరల్ అయి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే సినిమాలో ఈ సాంగ్ హీరోయిన్ వైపు నుంచి ఉంటుంది. తమిళ్ లో వా వాతి అని ఈ సాంగ్ ఉండగా అక్కడ కూడా ఈ పాట మంచి విజయాన్ని సాంధించింది. తెలుగులో ఈ సాంగ్ ని రామజోగయ్యశాస్త్రి రాయగా తమిళ్ లో ధనుష్ రాయడం విశేషం. సినిమాలో ఈ సాంగ్ శ్వేతా మోహన్ పాడింది. అలాగే తమిళ్ లో ధనుష్ కూడా ఈ పాటని పాడాడు. సినిమాలో ధనుష్ పాడిన వర్షన్ లేకపోయినా తాజాగా తమిళ్ లో ధనుష్ పాడిన వా వాతి సాంగ్ ని లిరికల్ రూపంలో రిలీజ్ చేశారు.

ఈ పాట విన్నవాళ్లంతా ధనుష్ చాలా బాగా పాడాడు అని పొగిడేస్తున్నారు. అయితే ఇది లిరికల్ సాంగ్ అయినా కొన్ని వీడియో బిట్స్ చూపించారు. ఇందులో ధనుష్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం, ధనుష్ హీరోయిన్ దండం పెట్టుకుంటుంటే అలాగే చూస్తూ ఉండటం, రాత్రిపూట పడుకొని ధనుష్ హీరోయిన్ ని చూస్తూ ఉండటం ఇలా కొన్ని సీన్స్ ని పెట్టారు. అయితే ఈ సీన్స్ ఏవి కూడా సినిమాలో లేకపోవడం విశేషం. సాధారణంగా కొన్ని సీన్స్ సినిమా ఫైనల్ వర్షన్ వచ్చాక ల్యాగ్ అనుకుంటే తీసేస్తారు. అలాగే ఇలాంటి పాటలకు ఎక్కువ సీన్స్ తీసుకొని ఉంచుకొని కావాల్సినవి వాడుకుంటారు. అయితే ఇప్పుడు వా వాతి సాంగ్ లో చూపించిన సీన్స్ తెలుగు సినిమాలో లేకపోవడంతో తమిళ్ లో వీటిని పెట్టారా? లేదా సినిమాలో కట్ చేసి ఇప్పుడు సాంగ్ లో చూపిస్తున్నారా? తర్వాత డిలిటెడ్ సీన్స్ అంటూ వీటిని యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తారా అంటూ ధనుష్ అభిమానులు, తెలుగు ప్రేక్షకుల ఆలోచిస్తున్నారు.

Sir Movie Free shows : 500 మంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఫ్రీగా ‘సార్’ సినిమా చూపించిన చిత్రయూనిట్, PVR..

ఆల్రెడీ సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సార్ సినిమాకు ఇప్పుడు ధనుష్ వా వాతి సాంగ్ రిలీజ్ చేసి మరోసారి ప్రమోషన్స్ చేయడంతో సినిమాకి మరింత ఆదరణ లభిస్తుంది. GV ప్రకాష్ సంగీత దర్శకత్వంలో ధనుష్ ఈ వా వాతి సాంగ్ ని అద్భుతంగా పాడాడు.