Dhanush: ధనుష్ ‘సార్’ ఆడియో లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాతి’ తెలుగులో ‘సార్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పిటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Dhanush: తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘వాతి’ తెలుగులో ‘సార్’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తుండగా, ద్విభాషా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఇప్పిటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఈ సినిమా నుండి తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
Dhanush50 : ధనుష్ మైల్ స్టోన్ మూవీ అనౌన్స్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
సార్ చిత్ర ఆడియో లాంచ్ గురించి గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఆడియో లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వేడుకను ఫిబ్రవరి 4న చెన్నైలోని సాయిరామ్ కాలేజీలో నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. దీంతో ఈ ఆడియో లాంచ్ కోసం ధనుష్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక సార్ సినిమాలో ధనుష్‌తో పాటు సంయుక్తా మీనన్ నటిస్తోండగా, ఈ సినిమాకు జీవి.ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుండగా, ఫిబ్రవరి 17న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Let the celebration begin ?
நம்ம #வாத்தி வரார் ?#Vaathi Grand Audio Launch on 4th Feb ?#VaathiVaraar ?@dhanushkraja #VenkyAtluri @iamsamyuktha_ @gvprakash @dopyuvraj @NavinNooli @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas @7screenstudio @adityamusic pic.twitter.com/yCY3J3Pc7N
— Sithara Entertainments (@SitharaEnts) February 1, 2023