Dhanush : KGF బ్యాక్ డ్రాప్ లో ధనుష్ – వెట్రిమారన్ సినిమా..

గతంలోనే ధనుష్ - వెట్రిమారన్ కలిసి నాలుగు సినిమాలు చేశారు. దీంతో మరోసారి ఈ ఇద్దరు జత కడుతున్నారనడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

Dhanush : KGF బ్యాక్ డ్రాప్ లో ధనుష్ – వెట్రిమారన్ సినిమా..

Dhanush Vetrimaran Movie planning in KGF Backdrop

Dhanush :  తమిళ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ తిరు(Thiru), సార్(Sir) సినిమాలతో 100 కోట్ల కలెక్షన్స్ సాధించాడు. త్వరలో కెప్టెన్ మిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ధనుష్ కి వెట్రిమారన్(Vetrimaran) తో సినిమా ఉండబోతుంది. గతంలోనే ధనుష్ – వెట్రిమారన్ కలిసి నాలుగు సినిమాలు చేశారు. పొల్లదావన్, ఆడుకాలం, వడాచెన్నై, అసురన్ సినిమాలు వీరి కాంబోలో వచ్చాయి. ఈ సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇందులో రెండు సినిమాలకు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి.

దీంతో మరోసారి ఈ ఇద్దరు జత కడుతున్నారనడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే మొదట వడాచెన్నై సినిమాకు సీక్వెల్ తీస్తారని అంతా భావించారు. కానీ సరికొత్త కథతో రాబోతున్నారు ఈ కాంబో. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (KGF) బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట. కోలార్ బంగారు గనుల బ్యాక్ డ్రాప్ లో వెట్రిమారన్ గత సినిమాల లాగే రా అండ్ రస్టిక్ గా ఈ సినిమా ఉంటుందని సమాచారం.

Bellamkonda Srinivas : విజయ్ దేవరకొండ సేఫ్.. రష్మికతో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చిన బెల్లంకొండ హీరో..

ఈ సినిమా నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. విక్రమ్ తంగలాన్ సినిమా కూడా కోలార్ గనుల నేపథ్యంలోనే ఉంటుంది. ఆ సినిమా కూడా మేమే నిర్మిస్తున్నాం. ఈ సినిమా కూడా కోలార్ బంగారు గనుల నేపథ్యంలోనే ఉండబోతుంది. కానీ కథ వేరు, వాటిని చూపించే విధానం వేరు అని తెలిపారు. మరోసారి ధనుష్ – వెట్రిమారన్ కలిసి మరో రా అండ్ రస్టిక్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలియడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనున్నారు.