కూల్‌గా.. క్రూరంగా.. అసురన్ – సెకండ్ లుక్..

అసురన్ సెకండ్ లుక్ పేరుతో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : August 24, 2019 / 08:17 AM IST
కూల్‌గా.. క్రూరంగా.. అసురన్ – సెకండ్ లుక్..

అసురన్ సెకండ్ లుక్ పేరుతో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్.. సినిమా అక్టోబర్ 4న విడుదల కానుంది..

తమిళ స్టార్ హీరో ధనుష్, వెట్రి మారన్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా.. ‘అసురన్’.. (రాక్షసుడు అని అర్థం). వి. క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మిస్తున్నాడు. ధనుష్, వెట్రి మారన్‌ల కలయికలో వస్తున్న నాలుగో సినిమా ఇది. ఇంతకుముందు వీళ్ల కాంబోలో ‘పొల్లాదవన్’, ‘ఆడుకళం’, ‘వడ చెన్నై’ సినిమాలు వచ్చాయి.

అసురన్‌లో ధనుష్.. రాజదేవన్, కాళీ అనే తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. మంజు వారియర్ అతనికి జోడీగా నటిస్తుంది. పూమణి రాసిన తమిళ నవల ‘వేక్కై’ ఆధారంగా.. రివేంజ్ డ్రామాగా అసురన్ తెరకెక్కుతుంది. ధనుష్ ఓల్డ్ ఏజ్ గెటప్‌తో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తమిళ తంబీలను ఆకట్టుకుంది. రీసెంట్‌గా అసురన్ సెకండ్ లుక్ పేరుతో రెండు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేశారు.

Read Also : మార్జావాన్ – ఫస్ట్ లుక్..

ఒక పోస్టర్‌లో యంగ్ గెటప్‌లో కూల్‌గానూ, మరో పోస్టర్‌లో క్రూరంగానూ కనిపిస్తున్నాడు ధనుష్. అక్టోబర్ 4న అసురన్  విడుదల కానుంది. ప్రకాష్ రాజ్, పశుపతి, యోగిబాబు, తలైవాసల్ విజయ్, బాలాజీ శక్తివేల్ తదితరులు నటిస్తున్నారు. సంగీతం:  జి.వి.ప్రకాష్ కుమార్, కెమెరా : వేల్‌రాజ్, ఎడిటింగ్ : వివేక్ హర్షన్.