Dharam Censor Board : హిందూ ధర్మాలను కాపాడేందుకు ధర్మ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు.. శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం!

గత కొంత కాలంగా బాలీవుడ్ లో పలు సినిమాలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. సెన్సార్ లేకపోవడంతో ఇటీవల కాలంలో ఓటిటిలో విడుదలవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లో హిందూ ధర్మాన్ని కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో ఇటువంటి చర్యలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం తీసుకుంది. శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరనంద్ ధరమ్ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Dharam Censor Board : హిందూ ధర్మాలను కాపాడేందుకు ధర్మ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు.. శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం!

Dharma Censor Board was set up to protect Hindu Dharma

Dharam Censor Board : గత కొంత కాలంగా బాలీవుడ్ లో పలు సినిమాలుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. హిందూ ధర్మాన్ని కించపరిచేలా సినిమాలు తీస్తున్నారు అంటూ పలు చిత్రాలను బాయ్‌కాట్ చేస్తూ వస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ సినిమాపై పెద్ద వివాదమే రాచుకుంది. నెటిజెన్లు దగ్గర నుంచి సినీ, రాజకీయ వర్గాలు వరకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. దేశంలోని కొన్ని మత సంఘాలు కూడా ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ డిమాండ్ లు చేస్తున్నారు.

Dil Raju : మళ్ళీ దిల్ రాజు వర్సెస్ టాలీవుడ్.. థియేటర్స్ గొడవ.. శివరాత్రికి కూడా థియేటర్స్ బ్లాక్??

ఈ మూవీలోని ‘బేషరమ్ రంగ్’ అనే పాటలో హీరోయిన్ దీపికా పదుకొణే.. కాషాయం రంగు బికినీ వేసుకోవడం ఒక కారణం అయితే. బేషరమ్ రంగ్ అంటే సిగ్గు లేని వర్ణం అంటూ అర్ధమొచ్చేలా పాటని రాయడం ఇంకొక కారణం. ఇప్పుడు ఈ వివాదం మరో స్థాయికి చేరుకుంది. సినిమాల్లో ఇటువంటి చర్యలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ లక్నోలోని శంకరాచార్య పీఠం సంచలన నిర్ణయం తీసుకుంది. శంకరాచార్య జ్యోతిష్య పీఠాధిపతి స్వామి అవిముక్తేశ్వరనంద్ ధరమ్ సెన్సార్ బోర్డ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సెన్సార్ బోర్డ్.. కత్తెర్లు వేసింది కేవలం సినిమాలకు మాత్రమే కాదు. సెన్సార్ లేకపోవడంతో ఇటీవల కాలంలో ఓటిటిలో విడుదలవుతున్న కొన్ని వెబ్ సిరీస్ లో హిందూ ధర్మాన్ని కించపరిచేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఇక నుంచి వెబ్ సిరీస్ కూడా రిలీజ్ కి ముందు సెన్సార్ పనులు పూర్తీ చేసుకోవాల్సిందే అంటున్నారు. ఈ ధరమ్ సెన్సార్‌ బోర్డ్‌ కార్యలయాన్ని ఈ నెల 15న ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. అలాగే దక్షిణాదిలోని రాష్ట్రాల్లో కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

జనవరి 19న మాఘ మేళాలో ఈ ధరమ్ సెన్సార్ బోర్డ్ గైడ్ లైన్స్ ను ప్రకటించనున్నారు. ఈ బోర్డులో సుప్రీం కోర్ట్ సీనియర్ లాయర్ PN మిశ్రా, సనాతన ధర్మ ప్రచారకర్త స్వామి చక్రపాణి, యూపీ ఫిల్మ్ డెవల్‌మెంట్ కార్పోరేషన్ వైస్ ప్రెసిడెంట్ తరుణ్ రాఠీతో పాటు మొత్తం 10 మంది సభ్యులు ఈ బోర్డులో ఉండబోతున్నట్లు సమాచారం.