NV Prasad : ధ్రువ 2 సినిమా ఆపేసి మరీ గాడ్‌ఫాదర్ తీశాం.. త్వరలో చరణ్‌తో ధ్రువ 2

NV ప్రసాద్ మాట్లాడుతూ.. మేము మోహన్ రాజాతో ధ్రువ 2 సినిమా గురించి పిలిచి మాట్లాడాము. చరణ్ తో ధ్రువ 2 సినిమా తీయాలనుకున్నాం. కథా చర్చలు జరుగుతున్న సమయంలో చరణ్ గాడ్ ఫాదర్ గురించి చెప్పాడు...............

NV Prasad : ధ్రువ 2 సినిమా ఆపేసి మరీ గాడ్‌ఫాదర్ తీశాం.. త్వరలో చరణ్‌తో ధ్రువ 2

NV Prasad :  మెగాస్టార్ చిరంజీవి నేడు దసరా రోజున గాడ్ ఫాదర్ గా ప్రేక్షకులని అలరించనున్నారు. మలయాళం సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగులో గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేశారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా నేడు అక్టోబరు 5న పాన్ ఇండియా వైడ్ రిలీజ్‌ అయింది.

నిన్నటివరకు చిత్ర యూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ లో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో నిర్మాత NV ప్రసాద్ మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. NV ప్రసాద్ మాట్లాడుతూ.. మేము మోహన్ రాజాతో ధ్రువ 2 సినిమా గురించి పిలిచి మాట్లాడాము. చరణ్ తో ధ్రువ 2 సినిమా తీయాలనుకున్నాం. కథా చర్చలు జరుగుతున్న సమయంలో చరణ్ గాడ్ ఫాదర్ గురించి చెప్పాడు. దీంతో ధ్రువ 2 ఆపేసి మోహన్ రాజాని గాడ్ ఫాదర్ సినిమాకి దర్శకుడిగా తీసుకున్నాం. త్వరలోనే చరణ్ తో మోహన్ రాజా దర్శకత్వంలో ధ్రువ 2 కచ్చితంగా ఉంటుంది” అని తెలిపారు.

BiggBoss 6 Day 30 : బిగ్‌బాస్ బర్త్ డే అంట.. గీతూకి లంచం ఇచ్చి మరీ..

చరణ్ కెరీర్ లో కొన్ని ఫ్లాప్స్ తర్వాత వచ్చి ధ్రువ సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పుడు ధ్రువ 2 ప్లాన్ చేస్తున్నారు అని తెలియడంతో చరణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మోహన్ రాజా ధ్రువ సినిమాని తమిళ్ లో తెరకేకించిన సంగతి తెలిసిందే. దాన్నే ఇక్కడ తెలుగులో రీమేక్ చేశారు. ఇప్పుడు ధ్రువ 2 మోహన్ రాజా దర్శకత్వంలో ఉంటుందనడంతో ఇప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెట్టుకుంటున్నారు అభిమానులు.