ఫ్యాన్సీ రేటుకి ధృవ సర్జా ‘పొగరు’ తెలుగు రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ నిర్మాత డి.ప్రతాప్‌రాజు..
Dhruva Sarja, Rashmika Mandanna’s Pogaru: ‘కరాబు మైండు కరాబు.. మెరిసే కరాబు.. నిలబడి చూస్తావా రుబాబు..’ అంటూ తెలుగు రాష్ట్రాల్లో సంచలన సృష్టించిన ‘పొగరు’ మూవీ సాంగ్‌ని ఎవరూ మర్చిపోలేరు. కన్నడలో ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ తో రికార్డులు సాధించింది.
తరువాత తెలుగులో కూడా తన ‘పొగరు’ చూపించాడు యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా.. తెలుగులో‘పొగరు’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ కారణంగా చాలా మంది తెలుగు రైట్స్ కోసం పోటీ పడగా 3 కోట్లకి పైగా ఫ్యాన్సీ రేటుతో వైజాగ్‌కు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజుగారు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత డి.ప్రతాప్ రాజు గారు మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఒకే ఒక్క సాంగ్‌తో యూట్యూబ్‌లో, టీవీ ఛానల్స్‌లో రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుని ట్రెండింగ్‌లో వున్న ‘పొగరు’ కన్నడ చిత్రం తెలుగు హక్కులను మా సాయిసూర్య ఎంటర్టైన్మెంట్ పేరుతో రూ. 3 కోట్ల 30 లక్షలకి సొంతం చేసుకున్నాము. ‘కరాబు’ పాటకు కన్నడలో 170 మిలియన్స్ పైగా వ్యూస్, తెలుగులో 43 మిలియన్స్‌కి పైగా వ్యూస్ రావటం అతి పెద్ద రికార్డని చెప్పాలి.
ఇంత క్రేజ్ వచ్చిన ఈ సినిమాకి మన టాలీవుడ్ నుండి చాలా పెద్ద కాంపిటేషన్ రాగా, మా సంస్థ సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ బాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. కన్నడ టైటిల్ ‘పొగరు’ కాగా తెలుగులో ఇంకా టైటిల్ కన్ఫార్మ్ చేయలేదు. అతిత్వరలో ఈ సినిమా రేంజ్‌కి తగ్గట్టుగా తెలుగులో టైటిల్ ఎనౌన్స్ చేస్తాము.
అలాగే వసరుసగా మూడు సూపర్‌హిట్స్‌తో డబుల్ హ్యట్రిక్‌కి శ్రీకారం చుడుతూ.. కన్నడలో దూసుకుపోతున్న ‘యాక్షన్ కింగ్’ అర్జున్ మేనల్లుడు, ‘యాక్షన్ ప్రిన్స్’ ధృవ సర్జా, టాలీవుడ్లో ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా సూపర్‌హిట్ అంటూ స్టాంప్ వేసుకున్న నేచురల్ బ్యూటీ రష్మిక మందన్నా జంటగా నటిస్తున్నారు. వీరిద్దరి మద్య వచ్చిన ‘కరాబు’ సాంగ్ విజువల్‌గా అందర్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
రిపీట్‌గా చూస్తున్నారంటే ఈ చిత్రం పై క్రేజ్ ఏంరేంజ్‌లో ఉందో తెలుస్తుంది. తరువాత వచ్చే సాంగ్స్, ట్రైలర్ ఇంతకి మించి వుంటుంది. దర్శకుడు నందన్ కిషోర్ ఈ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించారు. చందన్ శెట్టి, అర్జున్ జన్యలు సంగీతమందించిన ప్రతి సాంగ్ సంచలనం కాబోతుంది.
ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే.. డబ్ల్యూడబ్ల్యూలో ఫేమస్ ఫైటర్స్.. కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్లు విలన్స్‌గా నటిండం విశేషం. ఈ నలుగురు బాడీ బిల్డర్స్‌కి, ధృవ సర్జాకి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. ఇలాంటి చాలా సర్ప్రైజ్లను ఈ చిత్రంలో క్రియేట్ చేశారు డైరెక్టర్.. ఇంకా మరిన్ని విషయాల్ని త్వరలో తెలియజేస్తాం..’’ అన్నారు.