Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో మహేష్ డైలాగ్ పవన్ కోసమేనా?

మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి...

Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటలో మహేష్ డైలాగ్ పవన్ కోసమేనా?

Dialogue In Sarkaru Vaari Paata By Mahesh Is For Pawan Kalyan

Sarkaru Vaari Paata: మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏకంగా రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో మహేష్ మాస్ స్వాగ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలవడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. ఇక ఈ సినిమాలో మహేష్ చెప్పే మాస్ డైలాగులకు థియేటర్ల టాపులు లేచిపోయాయి.

Sarkaru Vaari Paata: ఓటీటీలో సర్కారు వారి పాట.. ఎప్పుడంటే..?

ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్‌లో బాబు చెప్పిన ‘‘నేను విన్నాను.. నేను ఉన్నాను..’’ అనే డైలాగ్ ఎంతలా రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని ఈ డైలాగ్ వైయస్.జగన్ ఎన్నికల ప్రచారంలో చెప్పిన డైలాగ్ కావడంతో దీనిపై సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ చేశారు. అయితే ఈ డైలాగ్ కంటే కూడా మరో పవర్‌ఫుల్ డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఈ డైలాగ్ విన్న వారు ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గురించే అని ఇట్టే పట్టేస్తారు. ఈ సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ పవర్‌ఫుల్ డైలాగ్..‘‘ జనం తోడు ఉన్నోడికి విజయం దక్కకపోయినా ఆ జనం అతడి వెన్నంటే ఉంటారు..అది చాలు!’’ అని ఉంటుంది.

Sarkaru Vaari Paata: ఆ ఒక్కదాని కోసం పది రోజులు కష్టపడ్డ మహేష్!

ఈ డైలాగ్ గ్యారెంటీగా పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఈ సినిమాలో వాడారని పలువురు కామెంట్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పవన్ కళ్యాణ్‌కు జనంతోడు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అందుకే అతడిని ఉద్దేశించే ఈ డైలాగ్ చెప్పి ఉండొచ్చని పలువురు కామెంట్ చేస్తున్నారు. ఇక మరో కోణంలో చూస్తే, పవన్‌తో మహేష్‌కు ఉన్న సాన్నిహిత్యం కారణంగా కూడా ఈ డైలాగ్ ఈ సినిమాలో పెట్టారని పలువురు అంటున్నారు. గతంలో పవన్ సినిమా ‘జల్సా’కు మహేష్ వాయిస్ ఓవర్ ఇవ్వడమే దీనికి ఉదాహరణగా వారు చెబుతున్నారు. ఏదేమైనా ఒక్క సినిమాలో ఇద్దరు రాజకీయ నేతలను ఉద్దేశించి మహేష్ చెప్పిన డైలాగులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.