పిండి ప్యాకెట్లలో పైసలు.. ఆమిర్ పనేనంటూ ప్రశంసలు..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను వినూత్నంగా ఆదుకున్నారంటూ వీడియో వైరల్..

పిండి ప్యాకెట్లలో పైసలు.. ఆమిర్ పనేనంటూ ప్రశంసలు..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పేదలను వినూత్నంగా ఆదుకున్నారంటూ వీడియో వైరల్..

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ పిండి ప్యాకెట్లలో నోట్లు పెట్టి పేద ప్రజలకు పంచారంటూ ఓ టిక్‌టాక్ వీడియో వైరల్ అవుతోంది. సినిమాను తలపించే ఈ వీడియోలో ఏముందంటే.. ఢిల్లీలో పేద‌ల‌కు సాయం చేసేందుకు ఓ ట్ర‌క్కు వీధి వీధికి తిరుగుతోంది. అందులో ఉన్న‌వాళ్లు కిలో గోధుమ పిండి ప్యాకెట్ల‌ను పేద‌ల‌కు అందిస్తున్నారు. ఉత్తి పిండి ప్యాకెట్లకేనా ఇంత హడావిడి అనుకుంటూ చాలామంది వెనుదిరిగిపోయారు. కానీ క‌నీసం అది కూడా లేని నిరుపేద‌లు ముందుకొచ్చి ఆ ప్యాకెట్ల‌‌ను ఆదుర్దాగా అందుకున్నారు.

ఎంతో సంతోషంతో వాటిని తీసుకుని ఇంటికి వెళ్లి తెరిచి చూడ‌గా అందులో ప‌దిహేను వేల‌ రూపాయ‌లు క‌నిపించాయ‌ట‌. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. దేవుడే ఇలా సాయం చేశాడని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అయితే ఈ ట్రక్ పంపించింది అమీర్ ఖానే అని, చేసింది చెప్పుకోవడం ఆయనకు ఇష్టముండదని.. మారుమూల నివసిస్తున్న పేదవారికి కూడా సాయమందించాలనే ఆయన ఇలా చేశారు అని అంటున్నారు ఆమిర్ అభిమానులు. అయితే ఆమిర్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ఈ విష‌యంపై ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు.