Chiranjeevi: ఆ డైరెక్టర్ నాగ్ తరువాత మెగాస్టార్‌ను ఒప్పించాడట.. నిజమేనా..?

మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Chiranjeevi: ఆ డైరెక్టర్ నాగ్ తరువాత మెగాస్టార్‌ను ఒప్పించాడట.. నిజమేనా..?

Did Kalyan Krishna Impress Chiranjeevi For A Movie

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘భోళాశంకర్’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శుకుడు మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే, ఈ సినిమా తరువాత చిరంజీవి తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అనే విషయంపై చిత్ర వర్గాల్లో రోజుకో వార్త వినిపిస్తోంది.

Chiranjeevi: చిరు నెక్ట్స్ మూవీపై మరో క్రేజీ వార్త.. ఏమిటో తెలుసా?

గతంలో డైరెక్టర్ వెంకీ కుడుముల చిరంజీవితో ఓ సినిమా చేస్తాడనే టాక్ బలంగా వినిపించింది. కానీ, ఈ డైరెక్టర్ ప్రస్తుతం యంగ్ హీరో నితిన్, రష్మిక జంటగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. దీంతో చిరుతో వెంకీ కుడుముల మూవీ ఇప్పట్లో లేనట్టే అని కన్ఫం అయ్యింది. అయితే, ఇప్పుడు చిరంజీవిని ఓ యంగ్ డైరెక్టర్ ఇంప్రెస్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో అక్కినేని నాగార్జునకు ‘సోగ్గాడే చిన్ని నాయన’, ‘బంగార్రాజు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన కళ్యాణ్ కృష్ణ తాజాగా ఓ పవర్‌ఫుల్ స్క్రిప్టును మెగాస్టార్‌కు నెరేట్ చేశాడట.

Chiranjeevi: నితిన్ అండ్ టీమ్ కోసం వస్తున్న మెగాస్టార్ చిరంజీవి!

ఈ స్క్రిప్టు పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండటంతో చిరు ఈ కథకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ కథను పూర్తిగా డెవలెప్ చేసి రావాల్సిందిగా చిరు సూచించాడట. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందనే విషయంపై అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. మరి నిజంగానే కళ్యాణ్ కృష్ణ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేస్తాడా లేడా అనేది చూడాలి.