Arya : ‘ఆర్య’ రోల్‌కి అల్లరి నరేష్‌ని అనుకున్నారట..

టాలీవుడ్ లవ్ స్టోరీస్‌లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఆర్య’ సినిమాలో అల్లరి నరేష్‌ని హీరోగా అనుకున్నారట సుకుమార్..

Arya : ‘ఆర్య’ రోల్‌కి అల్లరి నరేష్‌ని అనుకున్నారట..

Arya

Arya: తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో అద్భుతమైన ప్రేమ సినిమాలున్నాయి. విషాదాంతంగా మూగిసే ఆనాటి ‘దేవదాసు’ నుంచి ఇప్పటి వరకు మెమరబుల్ లవ్ స్టోరీస్ ప్రేక్షకులను మెప్పించాయి. ముఖ్యంగా యూత్‌ని ఆకట్టుకునే ప్రేమకథలు ట్రెండ్ క్రియేట్ చేశాయి.

Krishnam Raju : కాలుజారి పడ్డ కృష్ణంరాజు.. అపోలో ఆస్పత్రిలో సర్జరీ..

అలాంటి వాటిలో ‘ఆర్య’ ఒకటి. దర్శకుడిగా సుకుమార్‌కి ఫస్ట్ సినిమా.. హీరోగా అల్లు అర్జున్‌కి, నిర్మాతగా దిల్ రాజుకి రెండో సినిమా. ప్రేమకథా చిత్రాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. బన్నీకి స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. వన్ సైడ్ లవ్ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు మతి పోగొట్టారు డైరెక్టర్ సుకుమార్.

Arya Movie

 

అయితే ఆయన ముందుగా ‘ఆర్య’ మూవీని అల్లరి నరేష్‌ని హీరోగా పెట్టి తియ్యాలనుకున్నారట. అప్పటికే ఫస్ట్ సినిమా ‘అల్లరి’ తో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ అయితే ‘ఆర్య’ క్యారెక్టర్‌కి బాగుంటాడు అనుకున్నారట. కట్ చేస్తే.. కథ బన్నీ దగ్గరికి వెళ్లడం. తను ఓకే చేసెయ్యడం.. మూవీ బ్లాక్‌బస్టర్ అవడం జరిగిపోయింది. తర్వాత బన్నీ – సుక్కుల కలయికలో ‘ఆర్య 2’ వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’ రాబోతోంది.

Arya 2