Skylab: రండి బాబూ రండి.. ఆలస్యించిన ఆశాభంగం!

మన తెలుగు సినిమాలు తెరకెక్కించడమే కాదు.. ప్రమోషన్ చేసుకోవడంలో కూడా మేకర్స్ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. గంపగుత్తగా పాటలన్నీ ఒకేసారి కాకుండా.. ఒక్కొకటి ఒక్కక్కటి..

Skylab: రండి బాబూ రండి.. ఆలస్యించిన ఆశాభంగం!

Skylab

Skylab: మన తెలుగు సినిమాలు తెరకెక్కించడమే కాదు.. ప్రమోషన్ చేసుకోవడంలో కూడా మేకర్స్ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. గంపగుత్తగా పాటలన్నీ ఒకేసారి కాకుండా.. ఒక్కొకటి ఒక్కక్కటి ప్రేక్షకులను ఊరిస్తూ వదులుతున్న మేకర్స్.. గ్లిమ్ప్స్ అని.. టీజర్స్.. ట్రైలర్ ఇలా ఒక్కొకటి రిలీజ్ చేస్తూ ప్రేక్షకులలో అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి కూడా చాలదని మరికొంతమంది ఇంకాస్త దృష్టిపెట్టి డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వాళ్ళ సినిమాల కోసం ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేలా చేసుకుంటున్నారు.

Radhe Shyam: సాంగ్ వచ్చేసింది.. ‘నేను రోమియోని కాదు.. కానీ నేను జూలియట్‌నే’!

సత్యదేవ్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రల్లో విశ్వక్ ఖందేరావు దర్శకత్వంలో తెరకెక్కిన స్కై ల్యాబ్ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా సరికొత్తగా ఆలోచనతో ముందుకెళ్తున్నారు. డిసెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియోలు విడుదల అయి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంతుండగా సినిమా విడుదలకి రెండు రోజుల సమయం ఉండటంతో చిత్ర యూనిట్ సరికొత్త వీడియోను విడుదల చేశారు.

Acharya: మెగా హీరోల కోసం యంగ్ టైగర్ రాక..!

ఈ వీడియోలో తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ సినిమాలకి చెప్పే విధంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. అబ్బుర పరిచే దృశ్యాలతో.. కనీవినీ ఎరుగని హస్యాలతో మీ ముందుకు వచ్చేస్తుంది స్కై ల్యాబ్, డిసెంబర్ 4న మీ అభిమాన థియేటర్ల లో అంటూ.. రండి బాబూ రండి.. ఆలస్యించిన ఆశాభంగం!.. అనే ట్యాగ్ తో సోషల్ మీడియాలో వదిలారు. వాళ్ళు అనుకున్న డిఫరెంట్ కాన్సెప్ట్ వర్క్ అవుట్ కావడంతో ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది.