Ram Charan: రాంచరణ్-శంకర్ సినిమా నుంచి సాంగ్ లీక్.. రంగంలోకి దిగిన దిల్ రాజు

టాలీవుడ్ హీరో రాంచరణ్, తమిళ్ దర్శకుడు శంకర్ కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసందే. అయితే ఈ సినిమా సెట్స్ నుంచి ఇప్పుడు ఒక పాటకు సంబదించిన వీడియో లీక్ అవ్వడంతో, ఆ వీడియోని నెటిజెన్లు సోషల్ మీడియాలో...

Ram Charan: రాంచరణ్-శంకర్ సినిమా నుంచి సాంగ్ లీక్.. రంగంలోకి దిగిన దిల్ రాజు

Ram Charan: టాలీవుడ్ హీరో రాంచరణ్, తమిళ్ దర్శకుడు శంకర్ కలయికలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం మనందరికీ తెలిసందే. RC15 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నప్పటికీ మూవీ మేకర్స్ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో ఫాన్స్ ట్విట్టర్ వేదికగా సినిమా నిర్మాత దిల్ రాజుని ప్రశ్నించగా త్వరలోనే ఒక అప్డేట్ ఇస్తానంటూ మాటిచ్చారు.

Ram Charan: RC15కి డైరెక్టర్ శంకర్ ‘జీరో’ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడట.. నిజమేనా?

సోషల్ ఎలిమెంట్స్ ని జతచేస్తూ ఒక మాస్ కథాంశాన్ని చూపించడంలో డైరెక్టర్ శంకర్ దిట్ట. ఇందుకు ఆయన తెరకెక్కిచిన ‘జెంటిల్ మాన్’, ‘ఒకే ఒక్కడు’, ‘అపరిచితుడు’, ‘శివాజీ’ సినిమాలే నిదర్శనం. ఇప్పుడు అదే కోవలో రాంచరణ్, శంకర్ సినిమా కూడా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో చరణ్ కు జంటగా కియరా అద్వానీ నటిస్తుండగా, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, SJ సూర్య తదితరులు నటిస్తున్నారు.

అయితే ఈ సినిమా సెట్స్ నుంచి ఇప్పుడు ఒక పాటకు సంబదించిన వీడియో లీక్ అవ్వడంతో, ఆ వీడియోని నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ల మీద షేర్లు చేస్తున్నారు. దీంతో మూవీ మేకర్స్ స్పందిస్తూ.. “సినిమాకు అనుగుణంగా షూటింగ్ ను బహిరంగ ప్రదేశాల్లో జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు సహకరించి షూటింగ్ ప్రాంతంలో వీడియోలు గాని, ఫోటోలు గాని తీయడం.. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వంటివి చేయకండి. అలా చేస్తే మా యాంటీ ప్రైవసీ టీం చట్టరీత్య చర్యలు తీసుకుంటుంది” అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.