Dil Raju: వారసుడి కోసం బార్డర్ దాటిన దిల్ రాజు అండ్ కో!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు కూడా ఒకరు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఈ బ్యానర్ లో కనీసం ఒక్కటైనా..

Dil Raju: వారసుడి కోసం బార్డర్ దాటిన దిల్ రాజు అండ్ కో!

Dil Raju

Dil Raju: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు కూడా ఒకరు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఈ బ్యానర్ లో కనీసం ఒక్కటైనా హిట్ సినిమా ఉంటుంది. డిస్టిబ్యూటర్ నుండి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజుకు పోస్టర్ చూసి సినిమా రిజల్ట్ చెప్తారనే పేరుంది. అందుకే తమిళ, మలయాళ, హిందీ సినిమాలలో ఆయన డబ్బింగ్ సినిమా టేకప్ చేస్తే తప్పకుండ హిట్టే అని చెప్పుకుంటారు.

Bangarraju: అక్కినేని హీరోల దూకుడుకి బ్రేకేసిన కోవిడ్..!

ఇక, దిల్ రాజు అండ్ కో ఇప్పటి వరకు తీసిన సినిమాలలో లవ్ ఎమోషన్స్ సినిమాలు ఉన్నా.. చివరికి అవి ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముగించే సినిమాలుగా ఉంటూ వచ్చాయి. బాద్ షా సినిమాలో ఎన్టీఆర్ దిల్ రాజును ఇమిటేట్ చేస్తూ కూడా ఇదే కామెంట్స్ చేస్తాడు. ఒకపక్క లవ్ చేయకపోతే వెస్ట్ అంటూనే మరో పక్క పెద్దలు చెప్పిందే కరెక్ట్ అనేలా దిల్ రాజు సినిమాలు తీశారు. పక్కా ఎవరికి ఏం కావాలో లెక్కలేసి జానర్ ను ఎంచుకొనే దిల్ రాజు ఎక్కడా ఏ మాత్రం బార్డర్ క్రాస్ చేయకుండా చూసుకున్నాడు.

Sir Movie: ధనుష్ సినిమా నుండి భీమ్లా నాయక్ భామ అవుట్?

అయితే.. ఇప్పుడు తన వారసుడి కోసం ఫస్ట్ టైమ్ బార్డర్ క్రాస్ చేయాల్సి వచ్చింది. ఆ మాట కూడా దిల్ రాజే స్వయంగా చెప్పడం విశేషం. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా రౌడీ బాయ్స్. ఇప్పటికే ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో ఈ సినిమాకి ప్రమోషన్ చేయించిన దిల్ రాజు సినిమాలో కూడా యూత్ కి కావాల్సిన స్టఫ్ గట్టిగానే దట్టించినట్లు చెప్పారు. సినిమా చూసిన సెన్సార్ వారు ‘సార్ ఇది మీ సినిమానా?’ అని దిల్ రాజును అడిగేశారట. తన సినిమాలన్నీ కొంచెం పద్ధతిగా ఫ్యామిలీస్ తో వెళ్లేలా ఉంటాయని.. ఆశిష్ లాంచింగ్ కావడంతో ఈ సినిమాకి కొంచెం బోర్డర్ దాటామని చెప్పారు. బార్డర్ దాటిన దిల్ రాజు సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.